Kakani Govardhan Reddy: టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర అంటూ ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. అయితే, ఈ విషయంలోనూ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఈ కేసులో ఎవరిని ఇరికిస్తారో చూడాలని వ్యాఖ్యానించారు.. నాటకాల రాయుళ్లు అందరూ ఒక్కో డ్రామా వేస్తున్నారు.. అందులో ర్యాంకింగ్ ఇస్తే శ్రీధర్ రెడ్డికి నంబర్ వన్ స్థానం వస్తుందని ఎద్దేవా చేశారు.. రౌడీ గ్యాంగ్‌లను పెంచిపోషించింది శ్రీధర్ రెడ్డి కాదా..? అని నిలదీశారు.. పెరోల్ విషయంలో అడ్డంగా బుక్ అయ్యారు కాబట్టే.. దానిని డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు..
Read Also: PM Modi: ముగిసిన మోడీ జపాన్ టూర్.. చైనాకు పయనం
ఇక, రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ విషయంలో ఎవరు చెబితే హోంశాఖ మంత్రి అనిత సంతకం పెట్టింది..? ఎవరు ప్రలోభపెట్టారు..? అని ప్రశ్నించారు కాకాణి.. కోటంరెడ్డి వ్యవహారంలో వైసీపీ పాత్ర ఉందని సిగ్గు మాలిన విమర్శలు చెస్తున్నారని మండిపడ్డ ఆయన.. వీడియోలో ఉన్న వ్యక్తులు అందరూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత రూప్ మనుషులే అని ఆరోపించారు.. ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి, ఇలాంటి డ్రామాలే జగన్ ముందు ఆడితే.. అరెస్ట్ చేయించారని గుర్తుచేశారు.. తప్పులు చేసేది టీడీపీ నేతలు.. కేసులు మాత్రం వైస్సార్సీపీ నేతలపై పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. పేరోల్, మర్డర్ విషయం సీబీఐకి అప్పగించే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ చేశారు.. టీడీపీలో ఆధిపత్య పోరు ఉందేమో.. దాన్ని మా మీదకు నెట్టొద్దు అని సూచించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి..