గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (A.P.P.S.C.).. ఈ ఏడాది మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది ఏపీపీఎస్సీ.. అయితే, ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే మూల్యాంకనం చేపట్టిన ఏపీపీఎస్సీ.. నెల రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసింది. రిజల్ట్స్‌ను APPSC వెబ్సైట్లో పెట్టింది.
సొంత ఇంట్లో అద్దెకున్నట్టు ఫీలవుతున్నారట పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఎన్నికల తర్వాత కొద్ది రోజులు జనసేనకు, వర్మకు వ్యవహారం బాగానే నడిచింది. కానీ... నెమ్మదిగా గ్యాప్ పెరిగింది. చివరికి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే... కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఇష్టపడడం లేదు రెండు వర్గాలు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జనసేన కండువాలు కప్పుకున్నారు కొందరు వైసీపీ నాయకులు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో సమావేశం అయ్యారు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. లక్నోలోని కాళిదాస్ మార్గ్ లో ఉన్న యూపీ సీఎం నివాసంలో ఈ సమావేశం జరిగింది.. ఘన వ్యర్థాల ప్లాంట్ల అధ్యయనం కోసం లక్నో పర్యటనకు వెళ్లింది మంత్రి నారాయణ బృందం.. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత యూపీ సీఎం, అధికారులతో మంత్రి నారాయణ, ఏపీ అధికారుల భేటీ అయ్యారు.
సోషల్ మీడియా వేదికగా ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మా ప్రభుత్వ హయాంలో అవినీతి రహిత, పారదదర్శక పాలన ఆందించాం.. విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం.. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మోసపూరితంగా వ్యవహరిస్తోంది.. రెడ్ బుక్ పాలనతో ప్రభుత్వాన్ని అస్తవ్యస్తంగా మార్చారు.. ఇచ్చిన హామీలు అమలు చేయలేని అసమర్ధుడు చంద్రబాబు.. ప్రజలను పూర్తిగా మోసం చేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ప్రజల దృష్టి మళ్లించటానికి రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు..
ఓ వివాహిత అదృశ్యం కేసు.. రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రామసముద్రంలో చోటు చేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా రామసముద్రంలోని ఎగువపల్లె, శ్రీరాములపల్లి ప్రజల మధ్య వివాహిత అదృశ్యం కేసులో ఘర్షణ చెలరేగింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎర్రబోయినపల్లికు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఎస్సై రవికుమార్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
లిక్కర్ కేసులో నన్ను అరెస్టు చేయడానికి సిట్ అధికారులు ఎంతగానో తపన పడుతున్నారు... ఇలా పోలీసులు చేయడం చాలా బాధాకరం.. లిక్కర్ కేసులో సంబంధం లేని నన్ను ఇబ్బంది పెట్టాలని సంతోష పడాలని అనుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. గిరి, బాలాజీ సహా మరికొద్ది మందిని తీసుకెళ్లి నరకం చూపిస్తూన్నారట.. కాళ్లు, చేతులో కట్టేసి ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వేధించి చెవిరెడ్డి పేరు చెప్పించాలని చూస్తున్నారని విమర్శించారు.
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడు గుర్రాలపల్లిలో ఓ మైనర్ బాలికపై రెండేళ్లుగా వేర్వేరుగా 14 మంది కామాంధులు అత్యాచారం చేసిన ఘటనల తీవ్ర కలకలంరేపుతోంది.. అయితే, ఈ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది.. గతంలోనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా, మరో ఏడుగురు నిందితులు అరెస్ట్ చేసిన రామగిరి పోలీసులు.. పుట్టపర్తిలో జిల్లా ఎస్పీ ఎదుట నిందితులను హాజరుపరిచారు..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. దీనిపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.. రాష్ట్ర స్థాయి వేడుకగా కూటమి ఏడాది పాలన నిర్వహించాలని నిర్ణయించారు.. జూన్ 12వ తేదీన అంటే ఎల్లుండి సాయంత్రం ఈ వేడుకలు నిర్వహించనున్నారు..