విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు చెబుతూ.. అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళామణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం అన్నారు.. సూపర్ సిక్స్‌లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు.. తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు..
భూమా అఖిలప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆళ్లగడ్డలో నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. రూ. 25 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు.. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న కూటమి ప్రభత్వాన్ని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.. ఇక, కళ్లు తిరిగి పడిపోయి నేను హాస్పిటల్ లో ఉంటే.. నన్ను చూడటానికి ఎవరు వచ్చారు..? ఎవరు రాలేదంటూ..? వార్తలు రాస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. ఉదయం లేస్తే…
వరుస వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తాజాగా మరో ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈసారి మాత్రం ఆయన గట్టిగా ఇరుక్కున్నారు అని చెప్పకనే కరెక్ట్ అంటున్నారు తుంగతుర్తి ప్రజలు. నియోజకవర్గానికి చెందిన లిక్కర్ సిండికేట్ నిర్వాహకులతో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదం అవుతూ... సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది ఆ వీడియో. ఈ వివాదం ఉమ్మడి నల్గొండ హస్తం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఎవరు సంసారి.... ఎవరు సుద్దపూస.... ఎన్నికల్లో గెలవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.
మారాయ్... రూల్స్ మారిపోయాయ్..... ఇకనుంచి ఎవరు పడితే వాళ్ళు వచ్చి సైకిలెక్కి కూర్చుంటే... వాళ్ళ పాపాలను మోస్తూ.... బరువును భరిస్తూ తొక్కడానికి మేం సిద్ధంగా లేమని అంటున్నారట టీడీపీ పెద్దలు. అందుకే పార్టీలో చేరాలనుకునే వాళ్ళకు కొత్త కండిషన్స్ పెడుతున్నట్టు తెలుస్తోంది. అది వైసీపీ నుంచి కావచ్చు. ఇతర ఏ పార్టీ నుంచైనా కావచ్చు... టీడీపీలో చేరాలంటే తప్పనిసరిగా కొన్ని షరతులకు లోబడి ఉండాల్సిందేనని అంటున్నారట.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లలో గెలిచింది జనసేన. ఇక కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో... కీలకంగా ఉన్నారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అంతవరకు బాగానే ఉంది. కానీ, రానురాను ఆయన వైఖరి మాత్రం జనసైనికులకు నచ్చడం లేదట. వేదికల మీద ఆయన నవ్వుతూ సమాధానాలు చెబుతున్నా... మాకు మాత్రం కాలిపోతోందని నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం అంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ గెలిచింది...
తెలంగాణ తాజా రాజకీయం మొత్తం... కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూనే తిరుగుతోంది. కుంగుబాటుపై కమిషన్ విచారణ చివరి దశకు వచ్చిన క్రమంలో... ఇప్పుడు పొలిటికల్ హాట్‌గా మారిపోయింది. ప్రాజెక్ట్ అనుమతులు, నిర్మాణం, సాంకేతిక వివరాలకు సంబంధించి ఇప్పటికే 113 మందిని విచారించి వివరాలు రాబట్టింది కమిషన్. అందులో అన్ని విభాగాలకు చెందిన వారు ఉన్నారు.
ఎక్స్ (ట్విట్టర్)లో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి నారా లోకేష్.. జగన్ గారు మీ కపటత్వానికి నాకు నవ్వు వస్తోందన్న ఆయన.. "నాకు కాలేజీ లైఫ్ ఉంది.. మీకు జైలు జీవితం ఉంది".. "నాకు క్లాస్‌మెట్స్ ఉన్నారు... మీకు జైలుమెట్లు ఉన్నారు.." అర్థమైందా రాజా? అంటూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ట్యాగ్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.
సంగారెడ్డి జిల్లా నీటి పారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ పోస్ట్ మొన్న మే 31న ఖాళీ అయింది. అప్పటిదాకా ఎస్ఈగా పని చేసిన యేసయ్య పదవీ విరమణ చేయడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది కుర్చీ. అదేం పెద్ద విషయం కాదుగానీ... అందులో కూర్చునేందుకు ఆఫీసర్స్ అంతా భయపడటమే ఇప్పుడు అసలు సమస్య. పిలిచి ఎస్ఈ పోస్ట్ ఇస్తామన్నా... ఆసక్తి చూపడం లేదట అధికారులు.