శ్రీవారి ప్రసాదాల రుచి, నాణ్యత బాగా పెరిగిందని కితాబిచ్చారు టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు.. కుటుంబసభ్యులతో కలసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన దగ్గుబాటి సురేష్ బాబు.. ఈ రోజు వీఐపీ బ్రేక్ దర్శనంలో కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు సురేష్ బాబు..
తిరుమలలో మరోసారి ఆగమ శాస్త్రం ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి విమానం వెళ్లడం భక్తులను ఆవేదనకు గురిచేసింది. ఆగమశాస్ర్తం నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురంపై ఎలాంటి సంచారం జరగుకూడదని ఆగమ పండితులు పేర్కొంటున్నా.. అందుకు విరుద్ధంగా ఆలయ గోపురంపై విమానాలు వెల్తూండడం విమర్శలకు తావిస్తుంది.
NTR జిల్లా మైలవరంలో విషాదం నెలకొంది.. ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ మంత్రి.. మృతులు హిరణ్య (9), లీలసాయి (7)గా గుర్తించారు.. అయితే, రెండు నెలల కిందట పిల్లలను తన భర్త రవిశంకర్ వద్ద వదిలి వెళ్లిందట తల్లి చంద్రిక.. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురై.. ఆత్మహత్య చేసుకుందామని భావించి ఉంటాడని.. తన పిల్లలను ఎవరు పోషిస్తారనే వారిని కూడా హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
సీఎం చంద్రబాబు వైజాగ్ టూర్ రద్దు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ్టి విశాఖపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు.. షెడ్యూల్ ప్రకారం విశాఖలో నిర్వహిస్తున్న న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్లో సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు ఏపీ సీఎం.. మరోవైపు, విమాన ప్రమాదం ఘటనతో.. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట కూటమి ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన కార్యక్రమం కూడా […]
కర్నాటకలో హోసకోట్ సమీపంలోని గొట్టిపుర గేట్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు మృతిచెందారు.. తిరుపతి నుండి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసి బస్సు ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. దీంతో, బస్సులో ఉన్న కేశవరెడ్డి (44), తులసి (21), ప్రణతి (4) మరియు (1) సంవత్సరం చిన్నారి కూడా ప్రాణాలు విడిచింది.
పార్టీ ఓడిన తర్వాత నేతల పరిస్థితి ఎలా ఉంటుంది.. ఒకరంతా మౌనంగా వుంటారు.. మరికొందరు తిరగబడతారు.. కానీ, పేర్ని నాని.. ఆయన వేరు. పదవి పోయినా.. పరవశం పోకుండా.. ప్రత్యర్థులను ఢీకొట్టడానికి సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ్టి విశాఖపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు.. షెడ్యూల్ ప్రకారం విశాఖలో నిర్వహిస్తున్న న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్లో సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు ఏపీ సీఎం..
వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక.... ఇటు ఇంటికి, అటు పార్టీకి పూర్తిగా దూరమయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. దీంతో దశాబ్దాలుగా ఆయన్ని నమ్ముకుని ఉన్న కేడర్ చెల్లాచెదురవుతోందట. దీంతో టెక్కలి నియోజకవర్గ వైసీపీ కేడర్ను నడిపించే బాధ్యతను శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి తలకెత్తుకున్నారట. వైసీపీ దూరం పెట్టాక... అడపదడప మినహా..
Off The Record: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది జనసేన. జిల్లాలోని ఆరు సీట్లలో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించి కంచుకోటగా నిలబడింది. అలాంటి జిల్లాలో పార్టీ అధినేత ఆశించిందొకటి.. ఎమ్మెల్యేలు చేస్తున్నదొకటి అన్నట్టుగా తయారైందట పరిస్థితి. ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన జనసేన నేతలు.. మళ్ళీ అవకాశం వస్తుందో లేదో… భవిష్యత్తు సంగతి మనకెందుకు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామన్నట్టు ఆత్రంగా వ్యవహరిస్తున్నారట. […]
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. ఉందా.. లేదా అన్నట్టుగా... ఉండీ లేనట్టుగా... అలా అలా బండి లాగించేస్తున్న పార్టీ. అసలు ఒంట్లో బలం ఉందా లేదా అన్నదాంతో... సంబంధం లేకుండా సహజంగా వచ్చే డీఎన్ఏ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ని కూడా వేధిస్తున్నాయట. ఐకమత్యం, అందర్నీ కలుపుకునిపోవడం, కలిసి పనిచేయడంలాంటిని కాంగ్రెస్లో పెద్దగా కనిపించని లక్షణాలు.