Sugali Preethi Case: ఆంధ్రప్రదేశ్‌లో సుగాలి ప్రీతి కేసు మరోసారి చర్చగా మారి రచ్చకు దారితీస్తోంది.. సుగాలి ప్రీతి తల్లి పార్వతి కామెంట్లపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించడం.. ఆ తర్వాత జనసేన కౌంటర్ ఇవ్వడంతో రచ్చగా మారింది.. ఇక, మరోసారి స్పందించిన సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కౌంటర్‌కు దిగారు.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక చాలా సంతోషించాం.. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి లేదు.. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం 5 ఎకరాలు భూమి, 5 స్థలం, ఉద్యోగం ఇచ్చారు.. అది కూడా జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు.. నా కూతురుకు ఇదే న్యాయం చేసినట్టా? అని ప్రశ్నించారు. అయినా, నేను డబ్బుకోసం పోరాటం చేయడం లేదు.. నా కూతురు చనిపోయిన రోజే డబ్బులు ఇస్తామన్నా తీసుకోలేదు.. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ ఎలా అబద్ధాలు చెబుతున్నారు? అంటూ నిలదీశారు.
Read Also: Mirai: ట్రైలర్ లానే సినిమా ఉంటే.. బాక్స్ ఆఫీస్ షేకింగ్ పక్కా
పవన్ కల్యాణ్ మాట తప్పారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరు వాడా ఈ కేసు తీసుకెళ్లారు.. ఇప్పడు పవన్ కల్యాణ్ పై ఒత్తిళ్లు వస్తున్నాయా, ప్రలోభాలకు లొంగిపోయారా? అంటూ మండిపడ్డారు పార్వతి.. 14 నెలలుగా ప్రీతిబాయి కేసు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించడం తప్పా..? అని నిలదీశారు.. నటి జత్వాని కేసులో ఎలా జైలుకు పంపారో… ప్రీతిబాయి కేసులో విచారణాధికారులకు నార్కో అనాల్సిస్ టెస్ట్ చేయండి అంటూ సలహా ఇచ్చారు సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతి..
Read Also: Khushbu Family : ఏడాదిలోనే షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్.. ఖుష్బూ ఫ్యామిలీ ఫోటో వైరల్!
కాగా, సుగాలి ప్రీతి కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాను, డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించగానే నేను తీసుకున్న తొలి నిర్ణయం సుగాలి ప్రీతి కేసు అని గుర్తుచేసుకున్నారు.. ఆ పాపకి న్యాయం జరగాలి ఏమీ ఏమీ జరిగింది అని అడిగా? సుగాలి ప్రీతి కేసు త్వరిత పరిష్కారం కోసం నేను సిఫారసు చేశాను.. సీఐడీ చీఫ్, డీఐజీ, హోం మంత్రికి వెంటనే ఆదేశాలు ఇచ్చాను.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని నేను స్పష్టంగా చెప్పాను అన్నారు. అయితే, అప్పట్లో ఎవరైతే కుట్ర వెనుక ఉండి చెపుతున్నారో DNA తారుమారు చేశారు.. ఒత్తిడి చేసి భూములు అన్ని ఇచ్చేసి సాక్ష్యాలు తారుమారు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. DNA సాక్ష్యాలు మ్యాచ్ కావడం లేదు అని పోలీసులు చెపుతున్నారు ఇది వాస్తవం.. వివేకానందరెడ్డి గారిని చంపేశారు అని అందరకి తెలుసు.. ఎవరు అయితే నిందితులు ఉన్నారో ఒక్కొక్కరిని చంపేస్తున్నారు.. మరి గత ఐదు సంవత్సరాల్లో క్లాసిక్ కేసెస్ ప్రక్షాళానికే పూనుకున్నాం.. ఒక్కొక్క కేసును పరిష్కరిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే..