* నేటితో ముగియనున్న రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర.. బీహార్‌లో 16 రోజుల పాటు సాగిన రాహుల్ యాత్ర.. మొత్తం 25 జిల్లాల్లో, 110 నియోజక వర్గాల్లో 1,300 కి.మీ మేర సాగిన యాత్ర.. నేడు పట్నాలో బహిరంగ సభతో ముగియనున్న రాహుల్ యాత్ర
* పంజాబ్ కు మరో రెండురోజుల పాటు రెడ్ అలర్ట్.. 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పంజాబ్ లో అత్యధిక వర్షపాతం.. ఉప్పొంగుతున్న సటుజ్, బియాస్, రవి నదులు.. నీట మునిగిన
1,000 గ్రామాలు, 61,000 హెక్టార్ల వ్యవసాయ భూములు.. పంజాబ్ లో స్కూళ్లకు సెప్టెంబర్ 3 వరకు సెలవులు ప్రకటించిన సర్కార్
* అమరావతి: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ…
* నేడు అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వృద్ధులకు, వికలాంగులకు సామాజిక పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం.. తాళ్లపాకలో ప్రజా వేదికలో పాల్గొననున్న సీఎం.. అనంతరం టిడిపి శ్రేణులు తో సమావేశం.. సాయంత్రం 6 గంటలకు తాళ్లపాక నుంచి తాడేపల్లి కి బయలుదేరి వెళ్లనున్న సీఎం
* కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన .. రాత్రికి చింతకొమ్మదిన్నె మండలం కొలుముల పల్లె గ్రామంలో బస… 2వ తేదీ పెండ్లిమర్రి మండలంలో డిగ్రీ కాలేజీని ప్రారంభించనున్న మంత్రి. అనంతరం కొప్పర్తి పారిశ్రామిక వాడలో టెక్స్టైల్ యూనిట్ ని ప్రారంభించునున్న లోకేష్.. అనంతరం జమాలపల్లె టీడీపీ పార్టీ క్యాడర్ తో సమావేశం …
* హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. రాత్రి 1.30 వరకు సాగిన అసెంబ్లీ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన తర్వాత సభ నిరవధిక వాయిదా.. కాళేశ్వరంపై తొమ్మిదిన్నర గంటలపాటు సుదీర్ఘ చర్చ
* కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు నిర్ణయం.. కాళేశ్వరం పేరుతో దోచుకున్నవాళ్లందరికి శిక్షపడాలి-సీఎం రేవంత్‌రెడ్డి
* విశాఖలో నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పర్యటన… కింగ్ జార్జ్ హాస్పిటల్ లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక క్యాన్సర్ వైద్యసేవలు.. 40 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన బ్రాకో థెరపీ, లీనియర్ యాక్సిలేటర్, సీటీ స్టీమ్యూలేటర్ యూనిట్లు ప్రారంభించనున్న మంత్రి
* విశాఖ: నేడు బీచ్ రోడ్డులో ‘ లు లూ’ మాల్ పై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పబ్లిక్ హియరింగ్… హార్బర్ పార్క్ ఏరియాలో అత్యంత ఖరీదైన భూములు కేటాయింపును వ్యతిరేకిస్తూ పోరాటం.
* విశాఖలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన.. ‘ ఈస్ట్ కోస్ట్ మారీ టైం అండ్ లాజిస్టిక్ ‘ సెమినార్ కు ముఖ్య అతిథిగా సీఎం..
* ఇవాళ పులివెందులకు మాజీ సీఎం వైఎస్ జగన్.. రేపు దివంగత వైయస్‌ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న జగన్.. ఎల్లుండి ఉదయం బయలుదేరి వెళ్లనున్న జగన్..
* బాపట్ల : జె పంగులూరులో సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్..అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి రవికుమార్..
* ప్రకాశం : మర్రిపూడి మండలం పన్నూరులో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి..
* విజయవాడ : ఐపీఎస్ అధికారి సంజయ్ పోలీస్ కస్టడీ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు.. ఇప్పటికే ముగిసిన ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు.. తీర్పు నేటికి రిజర్వ్ ఏసీబీ కోర్టు
* విజయవాడ: నేడు CPS ఉద్యోగుల ఛలో విజయవాడ.. పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ తో ధర్నా చౌక్ లో సభ నిర్వహించనున్న APCPSEA
* పల్నాడు జిల్లా: పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదప్రవాహం. పది గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో 3 లక్షల 17వేల 998 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో… 3లక్షల 62వేల 961 క్యూసెక్కులు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ రాజమండ్రిలో సారధ్యం యాత్ర.. అభివృద్ధి , సంక్షేమంతో ఎన్డీయే పాలనపై ప్రచారం.. ఉదయం ఆర్ఎస్ఎస్ శాఖ సందర్శన, హేపీ స్ట్రీట్ లో చాయ్ పే చర్చ,, రాజమండ్రి వై.జంక్షన్ నుంచి సుబ్రహ్మణ్య మైదానం వరకు శోభాయాత్ర .. బహిరంగ సభ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రముఖులతో భేటీ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు జిల్లాలో వికలాంగులకు యథావిధిగా పెన్షన్ల పంపిణీ.. జిల్లాలో మొత్తం 2,35,813 మందికి రూ.102 కోట్ల 80 లక్షలు ఎన్ టీ ఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు
* పల్నాడు జిల్లా: నేడు పిడుగురాళ్ల హోంమంత్రి అనిత, మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. సూపర్ సిక్స్- సూపర్ హిట్ స్త్రీ శక్తి బహిరంగ సభలో పాల్గొనున్న మంత్రులు, ఎంపీలు బైరెడ్డి శబరి, శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి.
* తూర్పుగోదావరి జిల్లా: ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద క్రమేపి పెరుగుతున్న గోదావరి వరద నీటిమట్టం.. బ్యారేజీ వద్ద 13.1 అడుగులకు చేరిన వరద ఉద్ధృతి.. బ్యారేజీ 175 గేట్ల నుండి సుమారు 12 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల
* విజయనగరం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేటి షెడ్యూల్… దత్తిరాజేరు మండలం, కె. కృష్ణాపురం గ్రామంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. గజపతినగరంలో “అన్న కేంటీన్” శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. గజపతినగరం, పార్టీ కార్యాలయంలో బొండపల్లి, గజపతినగరం, దత్తిరాజేరు మండలాలకు సంబంధించిన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు..
* శ్రీకాకుళం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేటి కార్యక్రమాలు.. ఉదయం 8.00 గంటలకు సంతబొమ్మాళి మండలం మర్రిపాడులో పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు.. ఉదయం 9.00 గంటలకు సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామం పింఛనుల పంపిణీ కార్యక్రమం. ఉదయం 9.30 గంటలకు భావనపాడు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం. ఉదయం 10.00 గంటలకు భావనపాడు లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం.
* కర్నూలు: నేటి నుంచి మార్కెట్ ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోలు.. క్వింటాలు రూ.1200 చొప్పున కొనుగోలు చేయనున్న ప్రభుత్వం
* తిరుమల: 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,310 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,866 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు
* అమరావతి: నేడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ తల్లి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలకు బిజెపి పిలుపు.. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ లు ధగ్థం చేయనున్న బిజెపి శ్రేణులు