బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభ, నేతలు చేసిన కామెంట్లపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… టీడీపీ ఎజెండా ప్రకారమే బీజేపీ సభ నిర్వహించిందన్న ఆయన.. టీడీపీ, బీజేపీ, జనసేన… ఒకరు రాగం అందుకుంటే… మరొకరు పల్లవి అందుకుంటారు అంటూ సెటైర్లు వేశారు. ఎవరైనా ప్రజల సమస్యలపై మాట్లాడితే మేం సమాధానం ఇస్తాం.. కానీ, అలా కాకుండా వాళ్లే దేవాలయాలు కూలగొట్టేయటం, వాళ్లే ఆరోపణలు చేయటం రాజకీయమే అన్నారు. రాష్ట్రంలో […]
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం… డిసెంబర్ 31వ తేదీతో పాటు, జనవరి 1న కూడా బార్లు, వైన్ షాపులు, స్పెషల్ ఈవెంట్లకు ప్రత్యేక అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.. ఇక, డిసెంబర్ 31న వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉండనున్నాయి.. బార్స్, ఈవెంట్స్, […]
కరోనా మందుతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య.. ఇప్పుడు కలకలం సృష్టిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా మందు తయారు చేసినట్టు ప్రకటించారు.. ఇప్పటికే కొంతమంది ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నానికి రావడం.. స్థానికులు మందు పంపిణీని అడ్డుకోవడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.. మరోవైపు.. ఇప్పుడు ఆనందయ్యకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.. ఆనందయ్యకు తాజాగా నోటీసులు జారీ చేశారు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్… కరోనా మందు పంపిణీకి […]
వంగవీటి రాధా ఎపిసోడ్ ఇప్పుడు ఏపీలో చర్చగా మారింది.. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడనని పేర్కొన్నారు.. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని చెప్పిన రాధా.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.. దీనిపై పెద్ద చర్చే జరిగింది.. చివరకు ప్రభుత్వం వెంటనే రాధాకు 2+2 గన్మన్ల భద్రత కూడా కల్పించింది. రాధా భద్రతపై సీఎం వైఎస్ జగన్ సంబంధిత అధికారులకు కీలక […]
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే తెలంగాణను టచ్ చేసింది.. రోజురోజుకీ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో పెరిగిపోతూనేఉంది.. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 6 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 62కు చేరింది.. మరో విషయం ఏంటంటే.. ఆ 62 మందిలో 46 మంది వ్యాక్సిన్ తీసుకోనివారే ఉన్నారు.. దీంతో.. వ్యాక్సిన్ తీసుకోనివారిపై ఈ కొత్త వేరియంట్ త్వరగా ఎటాక్ చేస్తున్నట్టు […]
పీఆర్సీ ప్రకటనపై ఓవైపు ఉద్యోగులు ఎదురుచూస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ కసరత్తు కొనసాగుతూనే ఉంది.. ఇవాళ పీఆర్సీ పై మూడు గంటలకు పైగా సమావేశం జరిగింది.. సీఎం జగన్ నేతృత్వంలో ఆర్ధిక శాఖ అధికారుల సమావేశం నిర్వహించారు.. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు తదితరులు హాజరయ్యారు.. ఇక, సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఆర్ధిక శాఖకు సంబంధించిన సమావేశంలో పీఆర్సీపై చర్చ జరిగిందని […]
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు బాబులకు కిక్కే న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… డిసెంబర్ 31వ తేదీతో పాటు, జనవరి 1న కూడా బార్లు, వైన్ షాపులు, స్పెషల్ ఈవెంట్లకు ప్రత్యేక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్… డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.. ఇక, డిసెంబర్ 31న వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే […]
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవడేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది నేతలు బెయిల్‌పై ఉన్నారని.. త్వరలో వారు మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన… ఏపీలోని కొందరు నేతలు బెయిలుపై ఉన్నారు.. త్వరలో జైలుకెళ్లే అవకాశం లేకపోలేదు అంటూ కామెంట్లు చేసి ఒక్కసారిగా రాజకీయాల్లో హీట్ పెంచారు… ఇక, నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు రాష్ట్రానివి.. ఏపీలో […]
ఈ మధ్యే రేవంత్‌రెడ్డిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖ రాసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని మార్చాలని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి.. పార్టీ నేతలను కలుపోకోపోకుండా వ్యక్తి గత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడని, పార్టీ నేతలతో చర్చించకుండా పార్టీ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాడని ఆ లేఖలో ప్రస్తావించడం హాట్‌టాపిక్‌గా మారింది.. అయితే, ఇప్పుడు రేవంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.. […]