నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలవగానే భయంతో సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరారని ఎద్దేవా చేశారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఒక్కొక్కరు మిసైల్ లాంటి వారు.. మహిళలు కోరుకునేది సమాజంలో గౌరవం.. మహిళ అంటే భాధ్యత.. భాధ్యత అంటే మహిళ అన్నారు.. సభ్యత, సంస్కారం నేర్పించేది మహిళ.. సమాజంలో డ్రగ్స్ కి బానిసై యువత… తల్లి, చెల్లి అనే బేధం లేకుండా మానభంగాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. డ్రగ్స్ కల్చర్ వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే అని ఆరోపించిన ఆమె.. మద్యం సేవించి బానిసై అడబిడ్డలని, హత్యలు, మానభంగాలు చేస్తున్నారని.. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా? అని ప్రశ్నించారు.
Read Also: Uttarakhand: కొత్త సీఎం ఆమెనా..?
రాష్ట్రంలో సెక్యూరిటీ లేక మహిళలు బిక్కు బిక్కు మని జీవిస్తున్నారని వ్యాఖ్యానించారు విజయశాంతి.. ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదన్నారు.. యూపీలో భద్రత లేని చోట ప్రధాని మోడీ, సీఎం యోగి భద్రత కల్పించారన్న ఆమె.. ఇప్పుడు యూపీ మాఫియా చేతుల్లో లేదన్నారు. యూపీలో రెండో సారి గెలిచింది అంటే మంచి పనులు చేయడం వల్లనే అని స్పష్టం చేసిన ఆమె.. అపవిత్రంగా వున్న రాష్ట్రాన్ని యోగీ ప్రభుత్వం కడిగి పవిత్రం చేసిందన్నారు.. కానీ, ఈ (తెలంగాణ) రాష్ట్రంలో అలాంటి ప్రభుత్వం లేదని విమర్శించారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది.. ఏ పార్టీ ఇప్పుడు చేసే పనిలో లేదన్నారు. తప్పులు చేసిన ప్రభుత్వం పాతాళంలోకి పోతుందన్నారు. ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ దొంగ మాటలు చెబుతున్నారని ఆరోపించిన విజయశాంతి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందనే భయంతో ఆస్పత్రిలో పడుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
ఇక, ముందు ప్రజలు మారాలని సూచించారు విజయశాంతి.. గత ఐదేళ్లలో ఇస్తానన్న పతకాలు ఏమిచేయలేదని విమర్శించారు. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదని.. రెండు వేలు, మూడు వేలు ఇచ్చి మాయ చేస్తున్నాడని మండిపడ్డారు.. ఈ రాష్ట్రం బాగు పడాలంటే మీ చేతుల్లోనే వుంది.. మీకు చెప్పడం మా డ్యూటీ.. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం మీ డ్యూటీ.. మొత్తంగా రాష్ట్రంలో మార్పు అవసరం అన్నారు. మీరు బాగుండాలి తప్ప… ఇందులో నా స్వార్థం లేదన్న ఆమె.. ఆ నాలుగు రాష్ట్రాల్లో మహిళలు, యువత ఓట్లతో బీజేపీ గెలుపు సాధ్యమైంది.. మీరు లబ్ధి పొందండి.. టీఆర్ఎస్‌ను తుంగలో తొక్కిండి అని పిలుపునిచ్చారు. మగవాళ్లు మహిళలను గౌరవించాలని సూచించారు విజయశాంతి.. ఇంట్లో వారినే కాదు సమాజంలోని మహిళలను కూడా గౌరవంగా చూడాలి.. ఈ ప్రభుత్వ మారితెనే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్నారు.