రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… రైతుబంధు సొమ్మును రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది తెలంగాణ సర్కార్.. రేపటి నుంచి యాసంగి రైతుబంధు నిధులు పంపిణీ జరగనుంది.. ఈ పథకం ప్రారంభమయినప్పటి నుండి ఏడు విడతలలో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాలలోకి జమ అయ్యాయి.. ఈ సీజన్ తో కలుపుకుని మొత్తం రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో జమ కానున్నాయి.. ఇక, డిసెంబర్ 10వ తేదీ నాటికి […]
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాయి విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు.. నవంబర్ 31నే ప్రతిపాదనలకు చివరి రోజు కాగా.. డిసెంబర్ 27వ తేదీ వరకు అదనంగా గడువు ఇచ్చింది ఈఆర్సీ.. అయితే ఇప్పటికే ఏఆర్‌ఆర్‌లు సమర్పించిన డిస్కమ్స్.. మొత్తంగా 6831 కోట్ల చార్జీల పెంపునకు ప్రతిపాదనలు అందగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక, విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడిన టీఎస్ పీడీసీఎల్ సీఎండీ […]
తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.. అధికార పార్టీ అభ్యర్థికి పడాల్సిన ఓట్లు.. ప్రతిపక్ష అభ్యర్థికి పడ్డాయి.. పెద్ద సంఖ్యలో క్రాస్ ఓటింగ్ జరగడం చర్చగా మారింది. అయితే, ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఇప్పటికే ప్రకటించిన.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు… తాజాగా చేసిన కామెంట్లు హీట్ పెంచాయి.. ఉమ్మడి ఖమ్మంజిల్లా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తుమ్మల అని వ్యాఖ్యానించిన ఆయన.. నా గెలుపు ఉగాది పచ్చడిలా […]
డిసెంబర్ నెలతో పాటు 2021 ఏడాది ముగింపునకు వచ్చింది.. కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోతున్నాం.. అయితే, 2022 జనవరి నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు రాబోతున్నాయి… అయితే, ఆయా రాష్ట్రాలను బట్టి ఈ సెలవులు వర్తించనున్నాయి.. మొత్తంగా చూస్తే.. ఏకంగా 15 రోజులకు పైగానే సెలవులు రాబోతున్నాయి.. వరుసగా బ్యాంకు లావాదేవీలు చేసేవారు.. బ్యాంకుల చుట్టూ తిరిగేవాళ్లు.. అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. 2022 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలండర్‌ను విడుదల చేసింది రిజర్వు బ్యాంకు ఆఫ్ […]
దేశ రాజధాని ఢిల్లీకే పరిమితం కావడం కాదు.. క్రమంగా ఇతర ప్రాంతాలకు ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. ఇదే సమయంలో ఆ పార్టీని అనూహ్య విజయం పలకరించింది.. చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించింది ఆమ్ఆద్మీ పార్టీ.. చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి బరిలోకి దిగిన ఆప్.. 14 స్థానాల్లో విజయం […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు టాలీవుడ్ పెద్దలు.. మంత్రి పేర్నినానిని కలిసి చర్చలు జరపాలని భావిస్తున్నారు. రేపు సినీ ప్రముఖుల బృందం.. మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యే అవకాశం ఉంది.. కాగా, గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని థియేటర్లను ఇప్పటికే మూసివేశారు. టికెట్ రేట్లు తక్కువగా ఉంటే.. సినిమా థియేటర్లను నడపలేమంటూ.. మరికొందరు స్వచ్ఛందంగా సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. దాంతో.. […]
తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్, ఆయన ఫ్యామిలీపై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అన్ని జిల్లాల్లో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.. కానీ, ఖాళీలను భర్తీ చేయడం లేదు.. పది మంది ఉద్యోగులు చేయాల్సిన పని.. ఇద్దరితో చేయిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాల్లో పెండింగ్ ఫైళ్లు పెరిగిపోతున్నాయన్నారు. ఇక, సచివాలయంలోనూ ఫైళ్లు పేరుకపోతున్నాయన్న ఆమె.. […]
నదిలో ప్రయాణిస్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. నౌకమొత్తం వ్యాప్తించడంతో.. 40 మంది సజీవంగా దహనమైన విషాద ఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ తెల్లవారుజామున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝలోకతి సమీపంలోని సుగంధ నదిపై మూడు అంతస్తుల నౌక ప్రయాణం చేస్తుండగా.. మంటలు చెలరేగాయి.. నిమిషాల వ్యవధిలోనే పూర్తిస్థాయిలో నౌక మొత్తం వ్యాపించాయి మంటలు.. ఈ ఘటనలో 40 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 40 […]
తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే చలితో వణికిపోతున్నాయి.. అయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని.. 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది… ఉత్తర గాలులు తక్కువ ఎత్తులో ఉత్తరాంధ్రలోను.. మరియు తూర్పు గాలులు దక్షిణ ఏపీలో మరియు రాయలసీమలోనూ వీస్తున్నాయి.. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు రేపు […]
క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని పేర్కొన్నారు సీఎం జగన్.. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం–త్యాగాలకు జీసస్ తన జీవితం ద్వారా […]