ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా పార్టీ పదవులకు రాజీనామా చేస్తారనే ప్రచారం సాగింది.. దానికి అనుగుణంగానే ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో రాజీనామాకు సిద్ధమయ్యారు సోనియా గాంధీ… సీడబ్ల్యూసీ సమావేశం కోరితే పార్టీ పదవులకు రాజీనామా చేసిందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు సోనియా గాంధీ.. అయితే, సోనియా గాంధీ ప్రతిపాదనను ఏకగ్రీవంగా తిరస్కరించింది సీడబ్ల్యూసీ సమావేశం.
Read Also: CWC Meeting: ముగిసిన కాంగ్రెస్ అంతర్మధనం
సోనియా గాంధీ నాయకత్వం పట్ల సమావేశంలో నేతలంతా పూర్తి విశ్వాసం వ్యక్తం చేసినట్టు వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా.. ఎన్నికలు జరిగిన రాష్ట్రాలకు ఇంఛార్జ్‌లుగా వ్యవహరించిన నేతలంతా ఎన్నికల్లో అపజయానికి గల కారణాలను, జరిగిన లోపాలను, భవిష్యత్తులో సరిదిద్దుకోవాల్సిన అంశాలను విస్తృతంగా నివారించారని తెలిపిన రణదీప్ సింగ్ సూర్జేవాలా.. చాలా స్వేఛ్చాయుత వాతావరణంలో ఆరోగ్యకరమైన చర్చ జరిగిందని వెల్లడించారు.