World’s Longest Car: కారంటే ఇదేరా..! సిమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ ఇంకెన్నో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నో కొత్త కొత్త మోడల్స్ కార్లు రోడ్డుపైకి వస్తున్నాయి.. కస్టమర్లను ఆకట్టుకునేలా వాటిని డిజైన్ చేస్తున్నాయి ఆయా కంపెనీలు.. అయితే, ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్న కారును చూస్తే ఔరా! అనాల్సిందే.. ఎందుకంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద కారు ఇదే.. ఈ కారులో సిమ్మింగ్ పూల్, మినీ గోల్ఫ్‌కోర్స్, హెలిప్యాడ్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి.. అమెరికన్ డ్రీమ్ పేరుతో ఉన్న ఈ కారు గిన్నిస్ రికార్డులో కూడా ఎక్కింది.. ఈ కారు పొడవు 30.54 మీటర్లు.. మరో ప్రత్యేకత ఏంటంటే..? ఇరు వైపులా నడిపే సౌకర్యం ఉంది.. 1986లోనే ఈ కారును తయారు చేశారట. కాలిఫోర్నియాకు చెందిన కార్ కస్టమైజర్ జాయ్ ఓర్‌బెర్గ్ తొలుత ఈ కారును రూపొందించారు. సాధారణంగా కార్లు 12 నుండి 16 అడుగుల పొడవు ఉంటాయి. కానీ, జాయ్ ఈ కారును 18.28 మీటర్ల పొడవుతో తయారు చేశారు. అంతేకాదు.. ఇప్పుడు దానిని 30.5 మీటర్లకు పెంచారు. 26 చక్రాలు, రెండు వీ8 ఇంజన్లతో రూపొందించారు.
Read Also: Ukraine crisis: భారత రాయబార కార్యాలయం తరలింపు..
Also Read
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
ఇటీవల ఈ కారును అత్యాధునిక హంగులతో పునరుద్ధరించడంతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించడంతో ఒక్కసారి వైరల్‌గా మారిపోయింది ఈ అతిపెద్ద కారు.. సిమ్మింగ్ పూల్, హెలిఫ్యాడ్, టీవీ, ఫోన్, ఫ్రిజ్, బాత్‌టబ్, వాటర్ బెడ్ వంటి సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి.. ఈ కారు తయారు చేసిన కొత్తలో పలు సినిమాల్లో కూడా కనిపించిందని చెబుతున్నారు.. ఆ తర్వాత అద్దెకు కూడా తీసుకున్నారు. కానీ, నిర్వాహణ ఖర్చులు పెరగడం, పార్కింగ్ సమస్యలు రావంతో ఓ మూలన పెట్టేశారు.. అయితే, కారును వేలం వేయడంతో మైఖేల్, డిజెర్ ల్యాండ్ పార్క్‌కార్ మ్యూజియం యజమాని మైఖెల్ డిజెర్ కొనుగోలు చేసి.. ఆ కారుపై మరికొంత ఖర్చు చూసి.. కొత్త హంగులు రుద్దారు.
అత్యంత పొడవైన ఈ కారు ప్రయాణీకులకు లగ్జరీ ప్రయాణాన్ని అందిస్తుంది. ఒక పెద్ద వాటర్‌బెడ్, డైవింగ్ బోర్డ్, బాత్‌టబ్, మినీ-గోల్ఫ్ కోర్స్‌తో పూర్తి చేసిన స్విమ్మింగ్ పూల్ మరియు హెలిప్యాడ్.. ఇలా అనేక సౌకర్యాలు దీని సొంతం.. హెలిప్యాడ్ తయారు చేయడానికి వాహనానికి ఉక్కు బ్రాకెట్లు అమర్చారు. రిఫ్రిజిరేటర్లు, టెలిఫోన్, అనేక టెలివిజన్ సెట్లు కూడా ఉన్నాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఈ కారు 75 మందికి పైగా సరిపోతుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం దీని పునరుద్ధరణ 250,000 డాలర్లు ఖర్చు చేశారు.. కొత్త హంగులు దిద్దడానికి మూడు సంవత్సరాలు పట్టినట్టు చెబుతున్నారు.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు