ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న ఉద్యోగులకు నిరాశ ఎదురైనట్టు కనిపిస్తోంది.. మొత్తంగా ఈ ఏడాదిలో పీఆర్సీ ప్రకటన అనేది వట్టి మాటే అని తేలిపోయింది అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. పీఆర్సీ మళ్లీ తిరోగమనం వైపు మళ్లిందని.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి మళ్లీ ఉద్యమంలోకి వెళ్తాం అంటున్నారు.. పీఆర్సీపై కసరత్తులో భాగంగా.. ఇవాళ ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో ఆర్ధిక శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు.. సచివాలయ ఉద్యోగుల సంఘం […]
తాగి వాహనం నడిపితే పబ్లదే బాధ్యత అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు.. ఇళ్ల మధ్య పబ్ల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్పై ఇవాళ మరోసారి విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.. అయితే, పబ్లో నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేసింది హైకోర్టు.. పబ్ల ముందు ఖచ్చితంగా హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని.. తాగి వాహనాలను నడపవద్దు అంటూ హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ఉల్లంఘించిన వారిని […]
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకుంటారు.. కొలిచిన వారికి కొంగుబంగారం అయిన శ్రీవారికి రకరాల పూజలు, అభిషేకలు, ఊరేగింపులు.. కల్యాణాలు.. ఒక్కటేంటి.. శ్రీవారి వైభోగం మాటలకు అందదు.. చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ఈ ఏడాది మరో రోజుతో ముగియనుంది.. వచ్చే ఏడాది అంటే జనవరిలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలను ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం.. Read Also: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.. టీటీడీ […]
ప్రజాకవి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం లభించింది… ప్రజాకవిగా తన స్వరం విప్పిన గోరటి వెంకన్న పాటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. తెలంగాణ యాశలో.. అడవి, పల్లెలు, అనగారిన వర్గాల బాధలే కాదు.. ప్రేయసిపై పాట రాసికూడా అందరినీ ఆకట్టుకున్నారు.. ఇప్పుడు గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.. 2021 ఏడాదికి తెలుగు సాహిత్యంలో వల్లంకి తాళం కవితా సంపుటికి గోరటి వెంకన్నను ఈ అవార్డుకు ఎంపిక […]
భారత్లో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. ఓవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతుంటే.. మరోవైపు.. కోవిడ్ కేసులు కూడా అమాంతం పెరిగిపోయాయి.. గత వారం వరకు 7వేల లోపు నమోదవుతూ వచ్చిన రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య.. మళ్లీ పది వేలు దాటి 15 వేల వైపు పరుగులు పెడుతోంది… తాజాగా దేశవ్యాప్తంగా 13,154 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. 268 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇక, ఒమిక్రాన్ కేసులు కూడా వెయ్యికి […]
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.. న్యూ ఇయర్ నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.. కోవిడ్, నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలు జనవరి 2వ తేదీ వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్న ఆయన.. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ఈ ఆదేశాలు అమలు చేయాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఇక, వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు […]
భారత ప్రధాని నరేంద్ర మోడీ కారును అప్గ్రేడ్ చేస్తున్నారు.. మెర్సిడెస్-మేబ్యాక్ S 650 కారులో ప్రయాణం చేయనున్నారు ప్రధాని.. రేంజ్ రోవర్ నుంచి మెర్సిడెస్ బెంజ్కు రేంజ్ మార్చారు. సెక్యూరిటీ రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుండగా.. బుల్లెట్లు, పేలుళ్లు సంభవించినా సురక్షితంగా ఉండేలా ఈ కారును డిజైన్ చేశారట.. ఇక, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ కారు విలువ రూ.12 కోట్ల రూపాయలకు పైమాటేనని… రెండు మీటర్ల దూరంలో 15కేజీల టీఎన్టీ బ్లాస్ట్ జరిగినా.. […]
ప్రభుత్వం అన్నింటినీ జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తోంది.. కొన్ని శ్లాబుల్లో జీఎస్టీని సవరిస్తూ వస్తున్నారు.. ఇప్పటి వరకు మినహాయింపు ఉన్నవాటిని కూడా క్రమంగా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తున్నారు.. ఇక, ఆన్లైన్లో బుక్ చేసుకునే ఆటో రైడ్లపై 5 శాతం జీఎస్టీ విధించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించగా.. అవి జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి.. ఓలా, ఉబర్ వంటి యాప్ అగ్రిగేటర్ల ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్లు కూడా కొత్త సంవత్సరంలో మరింత ఖరీదుగా […]
నల్లగొండ పట్టణాభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రాష్ట్రంలోని అన్ని పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా అభివృద్ధి చెందాలని.. నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని.. ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని వెల్లడించారు.. నల్లగొండను అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలని ఆదేశించిన కేసీఆర్.. అభివృద్ధికి ప్రభుత్వం సరిపడా నిధులు ఇస్తుందని.. ఇందుకు తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలని స్పష్టం చేశారు.. నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం, అణువణువూ […]
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ కన్నుమూవారు.. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. కాసేపటి క్రితమే.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.. సంగారెడ్డి జిల్లా జాహీరాబాద్కు చెందిన అల్హాజ్ మహమ్మద్ ఫరీదుద్దీన్… హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికొత్స పొందుతూ మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో మైనారిటీ శాఖ మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్.. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ […]