ఫైర్ బ్రాండ్‌గా పేరుపొందిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి.. సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో హల్ చల్ చేశారు.. మద్య నిషేధాన్ని అమలు చేయాలనంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న ఆమె.. ఇవాళ ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది… వైన్ షాపులోకి వెళ్లి రాళ్లతో దాడి చేసి.. మద్యం బాటిళ్లను ధ్వంసం చేసింది… ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..
Read Also: Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి కీలక వ్యాఖ్యలు.. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లో మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఫైర్ బ్రాండ్ ఉమా భారతి.. దీనిపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రభుత్వానికి డెడ్‌లైన్ కూడా పెట్టారామె.. జనవరి 15వ తేదీ నాటికి మహారాష్ట్రలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసిన ఆమె.. లేని పక్షంలో రోడ‍్ల మీదకు వచ్చి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతానని.. నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తానని వార్నింగ్ కూడా ఇచ్చింది.. అయితే, ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పూనుకోలేదు.. దీంతో.. రంగంలోకి దిగారు ఫైర్ బ్రాండ్.. భోపాల్‌లోని ఓ వైన్ షాపుపై రాళ్లతో దాడి చేశారామె.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. కాగా, మధ్యప‍్రదేశ్‌లో బీజేపీ ప‍్రభుత్వమే అధికారంలో ఉండటం.. ఆమె కూడా బీజేపీ నేతే కావడం.. సొంత ప్రభుత్వంపై ఇలా విరుచుకుపడడం ఇప్పుడు చర్చగా మారింది.
Senior #BJP leader #UmaBharti in action at a #Liquor vend in #Bhopal, she has been batting for #LiquorBan in the state.
— Safa 🇮🇳 (@safaperaje) March 13, 2022
What is called LAW & ORDER? Is this the way to protest?#MadhyaPradesh pic.twitter.com/hvHLCjmtOr