ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం… జేఈఈ మెయిన్ దృష్ట్యా ఈ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్.. షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తి కావాల్సి ఉంది.. కానీ, జేఈఈ మెయిన్ ఏప్రిల్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇంటర్ పరీక్షలను వాయిదా వేశారు.. అయితే, ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను గతంలో ప్రకటించిన తేదీల్లోనే (మార్చి 11 […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభంకాబోతున్నాయి.. ఈ సమావేశాల్లోనే వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది సర్కార్.. అయితే, అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.. ఇవాళ సమావేశమైన టీడీపీ పొలిట్ బ్యూరో… అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చింది.. అయితే, టీడీఎల్పీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.. పొలిట్‌బ్యూర్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పార్టీ నేత కాలువ శ్రీనివాసులు.. కౌరవ సభను తలపించేలా అసెంబ్లీ సమావేశాలు […]
ఇప్పటికే ఐఏఎస్ అధికారుల విషయంలో రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.. ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లలో పక్షపాత వైఖరి సరికాదని సూచించారు.. బీహార్ అధికారులే మీకు నచ్చడం.. మెచ్చడం వెనక ఉద్దేశం ఏంటి..? అని లేఖలో ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి… DOPT నిబంధనలకు వ్యతిరేకంగా సోమేష్ కుమార్‌ని ఎలా సీఎస్‌ను చేశారని నిలదీశారు.. HMDA, RERAలో అరవింద్, సోమేష్ కుమార్ ఇచ్చిన అనుమతులపై విచారణ జరిపించాలని […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్‌ను చూస్తే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అనిపించేది.. వాళ్ల నాన్న (వైఎస్ రాజశేఖర్‌రెడ్డి) లేని లోటు తీరుస్తానని చెప్పా… అందుకే గత ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వండి.. చూడండి.. మళ్లీ అవకాశం రానే వస్తుంది.. మీరు మళ్లీ నిర్ణయం తీసుకోవచ్చునని చెప్పానన్న ఆయన… ప్రజలు వైఎస్ జగన్‌కు మంచి మెజార్టీ ఇచ్చారని తెలిపారు… అయితే, ప్రజల […]
కరోనా మహమ్మారి ఎంట్రీ సమయంలో… లాక్డౌన్లు, కట్టడి చర్యల కారణంగా దారుణంగా పడిపోయిన కూడాయిల్ ధరలు.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ఉధృతం అవుతోంది.. ఆ యుద్ధం ప్రభావం ఇప్పుడు ముడిచమురుపై పడుతోంది.. దీంతో గురువారం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర ఏకంగా 117 డాలర్లకు చేరింది.. ఇది దశాబ్దంలో గరిష్ఠ స్థాయి కావడం ఆందోళన కలిగించే విషయం.. మరోవైపు.. రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నా ఒపెక్ దేశాలు చమురు […]
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర వ్యవహారం తెలంగాణ సంచలనంగా మారిపోయింది.. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర… మహబూబ్ నగర్‌కు చెందిన యాదయ్య, రఘు, విశ్వనాథ్, నాగరాజు ఈ హత్యకు కట్ర పన్నారు. ఫరూక్ అనే వ్యక్తితో రూ.15 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని.. అయితే ఫరూక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్యకు జరిగిన కుట్ర బయటపడిందన్నారు.. ఫిబ్రవరి 23వ […]
ఉక్రెయిన్-రష్యా వార్ ఉధృతంగా సాగుతోంది.. మరోవైపు శాంతి చర్చలకు కూడా సిద్ధం అవుతున్నారు.. మొదటి విడత చర్చలు విఫలం కావడంతో.. బెలారస్లో రెండవ విడత శాంతి చర్చల కోసం ప్రతినిధులను పంపామని చెబుతోంది రష్యా.. అయితే, రష్యా చర్చలు జరపాలనుకుంటే వెంటనే దాడులు ఆపాలని డిమాండ్ చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. దీంతో, చర్చలు ఉంటాయా? లేదా? అనేది ప్రశ్నగా మారింది.. మరోవైపు, రష్యా దాడులు మొదలైన తర్వాత 9 లక్షల మందికి పైగా ప్రజలు […]
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది.. శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల అఫిడవిట్ అక్రమాల కేసుకు.. ఈ ప్లాన్‌కు లింక్ ఉన్నట్టు ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు.. గతంలో శ్రీనివాస్‌గౌడ్ అఫిడవిట్లో అక్రమాలున్నాయంటూ ఫిర్యాదులు ఉన్నాయి.. ఆ ఫిర్యాదులు ఇచ్చినవారినే కిడ్నాప్ చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో.. ఆ కిడ్నాప్ కేసుకు.. ప్రస్తుత హత్య కుట్ర కేసుకు లింకులు తెరపైకి వచ్చినట్టు అయ్యింది. కాగా, ఢిల్లీలో మహబూబ్‌నగర్‌కు […]
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రేపు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. రేపు సాయంత్రం 7.15 గంటలకు తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి రానున్నారు కేంద్ర మంత్రి షెకావత్… ఆయనకు రాత్రి విందు ఇవ్వనున్నారు ఏపీ సీఎం.. ఇక, మార్చి 4వ తేదీన సీఎం వైఎస్ జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టులోని నిర్వాసిత కాలనీలు, ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద పీపీఏ, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు గజేంద్ర సింగ్ షెకావత్… […]
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగింది.. ఆ కుట్రను భగ్నం చేశారు సైబరాబాద్ పోలీసులు.. కొందరు దుండగులు మంత్రిని హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు.. పేట్ బషీరాబాద్‌లో నిందితులను అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్‌లో సుపారీ కిల్లర్స్‌ను అదుపులోకి తీసుకోవడంతో ఈ కుట్ర భగ్నం చేశారు.. మొత్తం ఏడుగురుని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు… ఇక, మంత్రి హత్యకు రూ.12 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ సుపారీ కిల్లర్లను కలిసింది […]