నెల్లూరు జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి.. పొదలకూరు మండలం తాటిపర్తిలో తుపాకీ కాల్పులతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.. పెళ్లి చేసుకునేందుకు తనకి అమ్మాయిని ఇవ్వలేదనే అక్కసుతో కావ్య అనే అమ్మాయి (26)పై తుపాకీతో కాల్పులు జరిపాడు సురేష్ రెడ్డి అనే యువకుడు.. ఆ తర్వాత తనను తాను రివాల్వర్‌తో కాల్చుకున్నాడు.. కాల్పుల్లో గాయపడిన కావ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందగా.. సురేష్ రెడ్డి కూడా ఆ తర్వాత మృతిచెందాడు.
Read Also: Mahesh Babu: సితార టాలీవుడ్ ఎంట్రీ.. కన్ఫర్మ్ చేసిన మహేష్..?
కాగా, మాలపాటి సురేష్ రెడ్డి, కావ్య ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు… ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే.. బెంగళూరులోని ఓ సంస్థలో సురేష్‌రెడ్డి పనిచేస్తుండగా.. పుణెలోని సంస్థలో కావ్య పనిచేస్తున్నారు. అయితే, ఇద్దరూ ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్ హోమ్‌లోనే ఉన్నారు. ఇద్దరి కులాలు కూడా ఒకే కావడంతో.. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.. అయితే, కావ్యను సురేష్ రెడ్డికి ఇచ్చి వివాహం చేసేందుకు కావ్య తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.. వారిని ఒప్పించడానికి సురేష్ రెడ్డి చాలా రోజులుగా ప్రయత్నించినట్టుగా సమాచారం.. కానీ, ఎంతకీ వాళ్లు అంగీకరించకపోవడంతో.. తీవ్ర ఆగ్రహంతో ఉన్న సురేష్‌రెడ్డి.. మరోసారి కావ్య పేరేంట్స్, బంధువులతో మాట్లాడేందుకు ఇవాళ తాటిపర్తికి వెళ్లాడు.. కావ్యను ఇచ్చి పెళ్లి చేయాలని మరోసారి ఒప్పించే ప్రయత్నం చేశాడు.. అంతేకాదు… ఒప్పుకోకపోతే తుపాకీతో బెదిరించైనా ఒప్పించాలనే.. తన వెంట తుపాకీ కూడా తీసుకొని వెళ్లినట్టుగా తెలుస్తుండగా.. ఇక, ఇవాళ కావ్య పేరేంట్స్ తో గొడవపడ్డ సురేష్ రెడ్డి.. ఆవేశంతో ఆ తర్వాత కావ్యపై కాల్పులు జరిపాడు.. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు.. ఇద్దరూ మృతిచెందడంతో.. విషాదంగా మారింది.