Minister Peddireddy: పవన్ క్లారిటీ ఇవ్వాలి.. బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పొత్తుల గురించే మొత్తం చర్చ… ఏ పార్టీ నేత నోట విన్నా.. అదే మాట… పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీని టార్గెట్ చేస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ… పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పవన్ కల్యాణ్.. బీజేపీ, టీడీపీలతో కలిసి పోటీ చేస్తారా..? లేక బీజేపీని వదిలి టీడీపీతో కలిసి పోటీ చేస్తారా..? అని నిలదీశారు. ఇక, చంద్రబాబు, పవన్ తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని.. చంద్రబాబు ముసుగుగా పవన్ కల్యాణ్ మారారు అంటూ మండిపడ్డారు.
Read Also: Konda Vishweshwar Reddy: మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి కొత్త పార్టీ..?
Also Read
మరోవైపు, ప్రజలు తిరస్కరిస్తారనే భయంతోనే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని వ్యాఖ్యానించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదన్న ఆయన.. చంద్రబాబు అన్ని పార్టీల పొత్తుతో పోటీ చేయాలనే మేం కోరుకుంటున్నాం అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2024లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాగా, కాకినాడలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యల తర్వాత పొత్తుల రచ్చ మొదలైంది.. కానీ, తాన వ్యాఖ్యలు వక్రీకరించారు.. అసలు పొత్తుల గురించి తాను మాట్లాడిందేలేదంటున్నారు చంద్రబాబు.
తాజావార్తలు
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!