ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపును వేగవంతం చేసింది భారత ప్రభుత్వం.. ఇప్పటికే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలను కూడా రంగంలోకి దింపింది.. ఇక, మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ.. భారత విద్యార్థులను రష్యా మీదుగా తరలించాలని, విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని.. భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు.. దీంతో, ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు […]
ప్రపంచ దేశాల కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారి విజృంభణ తగ్గింది.. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది.. అయితే, ఇప్పటికే ఎంతో మంది దేశాధినేతలను పలకరించింది కరోనా.. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు ఇలా ఎంతో మందిని పలకరించింది మహమ్మారి.. తాజాగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మహమ్మారి బారినపడ్డారు. కొన్ని అనుమానితల లక్షణాలు ఉండడంతో.. ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.. దీంతో, వైద్య […]
కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి తగ్గి.. క్రమంగా కేసులు తగ్గుతున్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. కరోనా కట్టడి కోసం విధించిన ఆంక్షల నుంచి మరిన్ని సడలింపులు ప్రకటించారు.. మార్చి 3 నుండి కొత్త సడలింపులు అమలులోకి రానున్నాయి.. వివాహాలు, ఇతర సంబంధిత కార్యక్రమాలలో 500 మందిని అనుమతించాలని, అంత్యక్రియలు మరియు ఇతర సంబంధిత కార్యక్రమాలలో 250 మంది పాల్గొనవచ్చు అని స్పష్టం చేశారు సీఎం స్టాలిన్. ఇక, రాజకీయ, సాంస్కృతిక సమావేశాలను […]
రాసిపెట్టుకొండి వైఎస్ జగన్‌ను ఓడించడం చంద్రబాబు, లోకేష్ సహా ఎవరి తరం కాదని జోస్యం చెప్పారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, లోకేష్ , అచ్చెన్నాయుడు త్వరగా ఎన్నికలొచ్చేయాలి…అధికారంలోకి వచ్చేయాలని తపన పడుతున్నారని సెటైర్లు వేశారు. మా ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయ్యింది.. ఉప ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ అన్ని ఎన్నికలనూ ఎదుర్కొన్నాం.. ఒక్క ఎన్నికలోనైనా టీడీపీకి సింగిల్ డిజిట్ వచ్చిందా? అని ప్రశ్నించారు.. అన్నం తినేటప్పుడు ఎవడూ […]
ఉక్రెయిన్-రష్యా యుద్ధ జరుగుతోన్న సమయంలో ఇప్పటికే ఓ భారత విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. పంజాబ్‌కు చెందిన చందన్ జిందాల్ అనే 22 ఏళ్ల మెడికల్ విద్యార్థి మృతిచెందాడు… అనారోగ్య సమస్యలతో చందన్ జిందాల్ కన్నుమూసినట్టు చెబుతున్నారు.. రక్త గడ్డ కట్టడంతో చందన్ జిందాల్‌ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. బ్రెయిన్ స్ట్రోక్కారణంగా అతడు మృతిచెందినట్టు జాతీయ మీడియా పేర్కొంది.. ఉక్రెయిన్ […]
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది… ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా కొన్ని దేశాలు నిలుస్తున్నాయి.. ఆయుధాలు, ఇతర సమాగ్రి సరఫరా చేస్తున్నాయి.. దీంతో.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందా? అనే చర్చ సాగుతోంది.. ఇదే సమయంలో రష్యా విదేశాంగవాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మూడో ప్రపంచ యుద్ధమే వస్తే అది అణ్వాయుధాలతోనే సాగుతుందని.. ఈ యుద్ధంతో పెను విధ్వంసం తప్పదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యానించారు.. ఇక, […]
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పుల వ్యవహారం సంచలనగా మారింది.. ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.. అయితే, ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన భూ సెటిల్మెంట్లే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు.. సెటిల్మెంట్లతో పాటు శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కూడా దృష్టి సారించారు పోలీసులు.. హైదరాబాద్‌తో పాటు […]
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఏడో రోజుకు చేరుకుంది, ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా దేశంలోని ఇతర పెద్ద నగరాలపై దాడులను తీవ్రతరం చేశాయి రష్యా బలగాలు.. రాజధాని కీవ్ సిటీపై పట్టు సాధించేందుకు రష్యా ప్రయత్నం చేస్తోంది.. ఇతర నగరాలను హస్తగతం చేసుకుంటోంది. తాజాగా దక్షిణ ఉక్రెయిన్‌లోని అతిపెద్ద సిటీ అయిన ఖేర్సన్ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. రష్యా పాలమిలటరీ బలగాలు ఖేర్సన్లో బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఉక్రెయిన్ సైనికులతో పాటు, పౌరులు […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం (సీఎంవో)లో అధికారులకు శాఖలు కేటాయించారు.. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి… ఇక, సీఎంవోలో అధికారులకు కేటాయించిన శాఖల విషయానికి వస్తే.. స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డికి జీఏడీ, హోం, రెవెన్యూ, అటవీ, పర్యావరణ, వైద్య ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమ, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెసిడ్యువల్ – సబ్జెక్టులు కేటాయించగా.. […]
ఉక్రెయిన్ – రష్యా మధ్య భీకర పోరు సాగుతోంది.. రష్యా బలగాలకు ఉక్రెయిన్ ఆర్మీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది… యుద్ధంలో చనిపోయే ఉక్రెయిన్ల కంటే.. రష్యా సైనికుల సంఖ్యే భారీగా ఉంటుంది… గత 6 రోజుల్లో ఆరు వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఏడో రోజుకు చేరుకుంది.. ఇప్పటి వరకు కనీసం 14 మంది పిల్లలతో సహా 300 మందికి పైగా పౌరులు మరణించారని […]