టీడీపీ, జనసేన పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.. సింగిల్ గా పోటే చేసే దమ్ము లేకే చంద్రబాబు పొత్తుల ఎత్తులు వేస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. జగన్ ప్రభుత్వాన్ని ఎంతమంది కట్ట కట్టుకుని వచ్చినా దించలేరనే ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు సవాల్‌పై స్పందించిన అంబటి… విద్యుత్ చార్జీలు ఏపీ కన్నా కర్ణాటకలో ఎక్కువగా ఉన్నాయి.. ఆర్టీసీ ఛార్జీలు మహారాష్ట్రలో ఎక్కువ, మరి రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావు చంద్రబాబూ..? అంటూ ప్రశ్నించారు. రాజకీయ సన్యాసం చేస్తావా లేక ఇంకా సన్నాసి రాజకీయాలు చేస్తావా చంద్రబాబూ..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: Malla Reddy: రాహుల్ గాంధీ ఓ పప్పు.. మల్లారెడ్డి సెటైర్లు..
చంద్రబాబు.. క్విట్ ఏపీ అని ప్రజలు అంటున్నారు… ఆయన చెబితే ప్రజా ఉద్యమం వస్తుందా..? అంటూ సెటైర్లు వేశారు అంబటి రాంబాబు. చంద్రబాబు ఇక సీఎం కాలేడు అంటూ జోస్యం చెప్పిన ఆయన.. ఐదేళ్ల చంద్రబాబు పరిపాలన కన్నా మూడేళ్ల జగన్ పరిపాలన వెయ్యి రెట్లు గొప్పగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. రూ.1.39 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో వేసిన సీఎం జగన్ క్విట్ అవ్వాలా…!? అంటూ చంద్రబాబును నిలదీశారు. ఇంగ్లీషు మీడియం చదివితే మొద్దు అబ్బాయిలు అవుతారా! ఇంకానయం, లోకేష్ లా తయారవుతారనలేదు! అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు, జనసేనకు దశ, దిశ లేదు.. అంగడిలో వస్తువులా ఎవరు కొంటారా! అని రెడీగా ఉంటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన చంద్రబాబుకు మాత్రమే అమ్ముడుపోతుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు అంబటి రాంబాబు.