సింహం సింగిల్‌గానే వస్తుంది.. మళ్లీ జగనే సీఎం అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు… ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో బలమైన ప్రభుత్వం ఉంది… ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి కూడా లేదన్నారు. పొత్తులు పొత్తులు అని మాట్లాడుతున్నారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు బట్టలు చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు పొత్తులు అంటున్నాయి.. సింహం సింగిల్ గానే వస్తుంది.. మళ్లీ జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Breaking: నెల్లూరులో కాల్పుల కలకలం.. ఇద్దరు టెక్కీలు మృతి
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… ఢిల్లీని ఎదుర్కొన్న వ్యక్తి అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. చంద్రబాబు.. సోనియా గాంధీ, బీజేపీ, పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకుంటారు అని విమర్శలు గుప్పించారు. అధికారం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లనైనా పట్టుకుంటారు అంటూ మండిపడ్డారు. కాగా, కాకినాడ పర్యటనలో చంద్రబాబు చేసిన కామెంట్లతో మరోసారి ఏపీలో రాజకీయ పొత్తుల అంశం చర్చగా మారింది.. అయితే, తన వ్యాఖ్యలు వక్రీకరించారని.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలని తాను పిలుపునిచ్చా.. కానీ, పొత్తులపై మాట్లాడినట్లు వైసీపీ నేతలు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు..