ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.. భారత్‌లో ఒకప్పుడు ఊపు ఊపింది ఈ షార్ట్ వీడియో యాప్.. అయితే, చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన ఆ యాప్‌పై భారత ప్రభుత్వం బ్యాన్ విధించింది.. ఏదేమైనా.. ఎంతోమందిలోని ప్రతిభను బయటకు తీసింది టిక్‌టాక్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రాంతాల్లోనూ కాదు.. అంతరిక్షం (స్పేస్ స్టేషన్)లోనూ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది టిక్‌టాక్. దీనికి కారణం.. యురేపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఆస్ట్రోనాట్ సమంత క్రిస్టోఫోరెట్టి (45).. ఆమె అంతరిక్షంలో చేసిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌గా మారిపోయింది.. తన అంతరక్ష యాత్ర గురించి.. సవాళ్లు.. ఇతర విషయాలను వివరిస్తూ.. ఆమె చేసిన టిక్‌టాక్ వీడియో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది.
Read Also: Karumuri Nageswara Rao: సింహం సింగిల్ గానే వస్తుంది.. మళ్లీ జగనే సీఎం..!
కాగా, ఏప్రిల్ 27న అంతరిక్షంలో ఉన్న ఈఎస్‌ఏకి చెందిన ఆర్బిటింగ్ ల్యాబ్‌కు చేరుకున్నారు సమంత క్రిస్టోఫోరెట్టి… 6నెలల పాటు అక్కడ ఉండనున్నారు.. ఆ తర్వాత తిరిగి భూమిమీదకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈఎస్‌ఏ నుంచి 88 సెకన్ల టిక్ టాక్ వీడియో చేసిన ఆమె.. ఆ వీడియోలో స్పేస్‌ఎక్స్‌ఎస్ క్రూ-4 మెషిన్‌లో భాగంగా టూ జీరో – జీ ఇండికేటర్స్ తో పాటు ఎట్టా అనే మంకీ బొమ్మ గురించి తన వీడియోలో చెప్పుకొచ్చారు. తమ రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యిందని తన వీడియోలో పేర్కొన్నారు. ఇక, ఆ టిక్ టాక్ వీడియోను ఇప్పటికే 2.06 లక్షల మందికి పైగా వీక్షించారు.. లైక్‌లు, ట్వీట్లు, రీట్వీట్లు.. ఇలా సోషల్ మీడియాలో షేరింగ్‌కు కొదవేలేదు.. మొత్తంగా ప్రపంచంలోనే తొలిసారి అంతరిక్షంలో టిక్‌టాక్ చేసి చరిత్ర సృష్టించారు ఆస్ట్రోనాట్ సమంత క్రిస్టోఫోరెట్టి.
Back on the International @Space_Station (and TikTok) pic.twitter.com/oCgJSdWKcu
— Samantha Cristoforetti (@AstroSamantha) May 6, 2022