ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం (సీఎంవో)లో అధికారులకు శాఖలు కేటాయించారు.. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి… ఇక, సీఎంవోలో అధికారులకు కేటాయించిన శాఖల విషయానికి వస్తే.. స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డికి జీఏడీ, హోం, రెవెన్యూ, అటవీ, పర్యావరణ, వైద్య ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమ, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెసిడ్యువల్ – సబ్జెక్టులు కేటాయించగా.. […]
ఉక్రెయిన్ – రష్యా మధ్య భీకర పోరు సాగుతోంది.. రష్యా బలగాలకు ఉక్రెయిన్ ఆర్మీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది… యుద్ధంలో చనిపోయే ఉక్రెయిన్ల కంటే.. రష్యా సైనికుల సంఖ్యే భారీగా ఉంటుంది… గత 6 రోజుల్లో ఆరు వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఏడో రోజుకు చేరుకుంది.. ఇప్పటి వరకు కనీసం 14 మంది పిల్లలతో సహా 300 మందికి పైగా పౌరులు మరణించారని […]
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం దగ్గర ఇద్దరు రియల్టర్ల హత్య కలకలం సృష్టిస్తోంది.. భూవివాదం పరిష్కారం కోసం మాట్లాడుకుందామని పిలిచి కాల్పులు జరపగా.. ఒక రియల్టర్ ఘటనా స్థలంలోనే.. మరో రియల్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.. అయితే, ఈ హత్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ కలిసే ధరణి పోర్టల్ తెచ్చారని గుర్తుచేసిన ఆయన.. ఆ పోర్టల్‌లో మొత్తం తప్పులే ఉన్నాయని.. వాటి కారణంగా చాలా […]
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి చర్చగా మారింది.. ఈ కేసులో సీబీఐకి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది.. ఇక, ఆమె అవినాష్‌రెడ్డి పాత్రపై విచారణ జరపాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడంతో.. వాంగ్మాలంలో సీఎం వైఎస్ జగన్ పేరు ప్రస్తావించడం పెద్ద చర్చకు దారి తీసింది.. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. సంచలన వ్యాఖ్యలు […]
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఆపరేషన్ గంగ పేరుతో భారత పౌరులను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు సాగుతుండగా.. మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు.. భారత వైమానిక దళాన్ని తరలింపు ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను మరింత వేగంగా తీసుకు వచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.. భారత వైమానిక దళానికి చెందిన C-17 విమానం ద్వారా భారతీయులను తీసుకొచ్చేందుకు ఆలోచన […]
మహా శివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగిపోయింది.. ఇక, మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ‘పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే అతిపెద్ద పండుగ మహాశివరాత్రి.. ఈ పరమ పవిత్రమైన రోజున ముక్కంటి కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం వైఎస్ […]
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది… చర్చలు విఫలం అయిన తర్వాత తన భీకరంగా విరుచుకుపడుతోంది రష్యా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు మోహరించాయి.. ఏ క్షణమైనా.. ఏదైనా జరిగే ప్రమాదం ఉంది.. అయితే, దీంతో.. ఆయా దేశాలు తమ రాయబార కార్యాలయాలను కూడా ఖాళీ చేశాయి.. అత్యవసరంగా కీవ్ సిటీని వీడాలంటూ భారతీయులను హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం.. పరిస్థితి ఇలా ఉంటే.. రష్యాకు ఉక్రెయిన్ ఆర్మీ నుంచే కాదు.. […]
ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలు విఫలం అయిన తర్వాత యుద్ధం మరింత భీకరంగా సాగుతోంది.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీపై ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉంది.. దీంతో ఉక్రెయిన్‌లోని తమ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం.. ముఖ్యంగా కీవ్ సిటీని వెంటనే ఖాళీ చేయాలని.. కీవ్‌ను భారతీయులు తక్షణమే వదిలి పెట్టాలని కేంద్రం ఆదేశించింది.. కీవ్ సిటీ నుంచి ఎలాగైనా బయటపడండి అని ఆదేశాలు జారీ చేసింది. Read Also: Zain Nadella: […]
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ కన్నుమూశారు.. అతని వయస్సు 26 సంవత్సరాలు.. మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల మరణించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.. 26 ఏళ్ల జైన్ సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నారు.. జైన్ జన్మించినప్పటి నుంచే సెరిబ్రల్ పాల్సీని ఎదుర్కొంటున్నాడు.. ఇవాళ ఉదయం కన్నుమూశారు.. జైన్ మరణించినట్లు సత్య నాదెళ్ల తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఈమెయిల్ ద్వారా తెలిపారు. Read […]
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి… ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ పరిస్థితి విషమంగా ఉంది… ఈ ఘటనకు భూ వివాదమే కారణంగా చెబుతున్నారు.. ఇటీవలే 10 ఎకరాల భూమిని ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి అనే ఇద్దరు రియల్టర్లు.. అయితే, అప్పటికే ఆ భూమిపై కబ్జాలో ఉన్నాడు మట్టారెడ్డి అనే వ్యక్తి.. […]