నారాయణపేట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రి కేటీఆర్
భారత దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మనం కడుతున్న పన్నులతో కేంద్రం కులుకుతోంది. కేంద్రానికి పన్నుల రూపంలో కట్టింది రూ. 3,65,797 కోట్లు. తెలంగాణకు వచ్చింది కేవలం రూ. 1.68 లక్షల కోట్లు మాత్రమే. తెలంగాణ చమట, రక్తంతో బీజేపీ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఉర్దూలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. యూపీఎస్సీ పరీక్షలు ఉర్దూ భాషలో నిర్వహించడం లేదా...? ఉర్దూలో పరీక్ష నిర్వహిస్తే తప్పా..? ఉర్దూ అంటే ఎంత సేపు ముస్లింల భాషగానే చూస్తారా..? బీజేపీ నేతలపై కేటీఆర్ విమర్శలు
బీజేపీ నేతలు సిగ్గు లేకుండా పాదయాత్రలు చేస్తున్నారు. వికారాబాద్ - కృష్ణ వరకు గద్వాల నుంచి మాచర్ల వరకు రైల్వే లైన్ ప్రకటించాలి. మతం పేరిట పంచాయతీలు పెడుతోంది బీజేపీ. అంబేద్కర్ రాజ్యాంగంలో కొత్త జిల్లా ఏర్పాటు అయితే నవోదయ పాఠశాల పెట్టాలి. దేశంలో 84 కొత్త నవోదయ పాఠశాలలు పెడితే... తెలంగాణకు గుండు సున్నా... మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారు. ఒక్క జాతీయ విద్యా సంస్థ ఇవ్వలేదు.
ప్రధాని మోదీకి దమ్ముంటే పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి. బీజేపీ నేతలు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. మీ ప్రధాని మోదీకి చిత్తశుద్ధి, తెలంగాణపై ప్రేముంటే పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి. పక్కన కర్ణాటకలో అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చారు. మేకు సిగ్గు, నిజాయితీ ఉంటే 500 టీఎంసీలు కేటాయిస్తూ... ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలి
కొంతమంది నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. పాలమూరు పచ్చబడుతుంటే కొందరి కళ్లు ఎర్రబడుతున్నాయి. కృష్ణ నదిలో నీటి వాటాను తీసుకోవడంలో తెలంగాణ విఫలమైందని కొందరు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. కృష్ణ నదిలో మన రాష్ట్రం వేరుపడక ముందు 811 టీఎంసీ కేటాయింపులు ఉండేవి. ఎనిమిదేళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్నా... ఈ 811 టీఎంసీలలో 575 టీఎంసీలు ఇవ్వాలని కోరితే కేంద్రం నుంచి స్పందన లేదు
సంక్షోభంలో వ్యవసాయం ఉంటే... స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ఒక్కో పంటకు రూ. 5 వేలు రైతుబంధు ఇస్తున్నాం. రైతులు చనిపోతే.. రూ. 5 లక్షల రైతు బీమా ఇస్తున్నాం. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.. ఒక్క కేసీఆర్ కే ఇది సాధ్యమైంది
విద్యార్థులు పదో తరగతి తరువాత డిగ్రీలు, డాక్టర్, ఇంజనీర్లు అవుతామంటే వారికి ఫీజులు చెల్లిస్తోంది కేసీఆర్ సర్కార్. ఉన్నత చదువుల కో్సం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు బాబా సాహెబ్ అంబేద్కర్ స్కాలర్ షిప్, జ్యోతి బాపూలే స్కాలర్ షిప్ ద్వారా రూ. 20 లక్షలు ఇస్తోంది తెలంగాణ సర్కార్
హైదరాబాద్ లో ఉండే కేసీఆర్ మనవడు, మనవరాలు ఏ సన్న బియ్యం తింటారో... విద్యార్థులకు కూడా అదే రకంగా సన్న బియ్యంతో భోజనం. పేదింటి బిడ్డలకు కడుపునిండా తిండి పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణే. తెలంగాణ వ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలలు పెట్టాం. బట్టలు, పుస్తకాలు, భోజనం ఇలా రూ. 1.27 లక్షల ఒక్కో విద్యార్థిపై ఖర్చు పెడుతున్నాం.
నారాయణ పేట జిల్లాలో పెళ్లి చేసుకుంటే కులం, మతంతో సంబంధం లేకుండా... రూ. ఒక లక్షా నూటపదహారు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామగా మారి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేస్తున్నారు. 11.5 లక్షల ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సహాయం
నారాయణ పేట జిల్లా కంసాన్ పల్లి ప్రజలకు శుభవార్త... వెయ్యి ఎకరాల ప్రభుత్వ స్థలం లో 200 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్న పేదలకు యాజమాన్య హక్కులు, రైతుబంధు. 800 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
ఎప్పుడు ఎవరూ అనుకోలేదు నారాయణ పేట జిల్లా కేంద్రం అవుతుందని... కేసీఆర్ దయ, ప్రోత్సాహం వల్ల జిల్లా కేంద్రంగా ఏర్పడింది. అన్ని రకాల హంగుల కోసం నారాయణ పేటకు మాస్టర్ ప్లాన్
ఇప్పుడున్న మార్కెట్ కు అదనంగా మరో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ రూ. 6 కోట్లతో నిర్మాణం
మిషన్ వస్త్రాలయ ద్వారా రూ. 87 లక్షల 45 వేలతో నిర్మాణం, జిల్లా కేంద్రం నారాయణ పేటకు పట్టణ ప్రగతి కింద రూ. 6.80 కోట్లు
దమ్ముంటే దివంగత నేత సుష్మాస్వరాజ్ చెప్పినట్టు పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించండి
ప్రధాని మోడీ, బీజేపీ రాష్ట్ర నేతలకు చిత్తశుద్ధి ఉంటే జాతీయ హోదా తేవాలి
మాపై విమర్శలు చేయడం కాదు.. తెలంగాణకు మీరు చేసింది ఏంటి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం..
అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం
నారాయణ పేటపై వరాల జల్లు, జిల్లా గ్రంథాలయానికి శంకుస్థాపన, రూ. 6.60 కోట్లతో మిని స్టేడియం మంజూరు. జిల్లా కేంద్రంలో రజక సోదరుల కోసం ఆధునిక మెకనైజుడ్ ధోబీ ఘాట్. సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, కొండారెడ్డి పల్ల చెరువును రూ. 4 కోట్లతో మిని ట్యాంక్ బండ్, ఈద్గా కు రూ. 2.05 కోట్లు మంజూరు
నారాయణపేట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రి కేటీఆర్