శ్రీరామ నవమి వచ్చేస్తోంది… అయితే, ఈ సందర్భంగా నిర్వహించే శోభాయాత్రపై అంశం హైకోర్టుకు చేరింది… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసాలో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఈ మధ్య చోటుచేసుకున్న కొన్ని ఘటన నేపథ్యంలో.. భైంసాలో శోభాయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో, హైకోర్టు మెట్లెక్కింది హిందూ వాహిని సంస్థ.. ఇక, కొన్ని ప్రాంతాల్లో శోభాయాత్రకు అనుమతివ్వకపోవడంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. భైంసాలో శ్రీరామనవమి […]
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర యుద్ధం చేస్తోంది.. రెండు దేశాల మధ్య యుద్ధం 44వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై మళ్లీ రాకెట్ దాడులతో విరుచుకుపడుతోంది. బాంబులు, క్షిపణులు, రాకెట్ దాడులతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. కీవ్ నుంచి పుతిన్ సేనలు నిష్క్రమించినప్పటికీ మిగతా చోట్ల విధ్వంసక చర్యలు కొనసాగిస్తూ ప్రాణాల్ని బలితీసుకుంటున్నాయి. తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్స్ ప్రాంతం క్రమటోర్స్క్ రైల్వే స్టేషన్‌పై జరిగిన రెండు మిసైల్ దాడుల్లో కనీసం 35 మంది మృతిచెందారు. 100 […]
తెలంగాణలో యాసంగిలో పండిన వరి ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో టీఆర్ఎస్ ఆందోళనలు ఉధృతం చేసింది. ఇప్పటికే మండల కేంద్రాల్లో ధర్నాలు… జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాలను పూర్తి చేసిన టీఆర్ఎస్… గురువారం జిల్లా కేంద్రాలు… కలెక్టరేట్ల వద్ద నిరసన దీక్షలు చేపట్టింది. వరుస ఆందోళనల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు కూడా పాల్గొన్నాయి. శుక్రవారం నల్ల జెండాలు ఎగురవేయడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించాయి టీఆర్ఎస్ శ్రేణులు. ధాన్యం కొనుగోలు విషయంలో […]
ఈ మధ్యే చిల్లర కష్టాలకు చెక్‌పెడుతూ.. చార్జీల రౌండప్ పేరుతో భారీగా వడ్డించిన తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పుడు మరోసారి ప్రయాణికులకు షాక్ ఇస్తూ మళ్లీ చార్జీలను పెంచింది. డీజిల్ సెస్ పేరుతో అదనంగా ప్రయాణికులపై భారం వేసింది.. ఇక నుంచి బస్సు సర్వీసుల్లో కనీస ధర రూ.10గా నిర్ణయించింది టీఎస్ఆర్టీసీ.. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో రూ. 2 చొప్పున చార్జీలు పెరగనుండగా.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ. 5 […]
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఆందోళన పర్వానికి తెరలేపారు.. అయితే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. వెంటనే ఐకేపీ కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేసిన ఆయన.. కేంద్రం కొంటుందా.. రాష్ట్రం కొంటుండా అని కాదు.. ఏపీ, కర్ణాటకలో కొనుగోలు పంచాయతీ లేదు.. కానీ, తెలంగాణలో మాత్రం డ్రామాలు నడుస్తున్నాయని విమర్శించారు.. […]
తెలంగాణ సర్కార్-రాజ్‌భవన్ మధ్య క్రమంగా దూరం పెరుగుతూ పోతోంది… గవర్నర్ తమిళిసై బహిరంగంగానే ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలపై విమర్శలు గుప్పించడం.. ఈ మధ్యే హస్తినలో పర్యటించి.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన తర్వాత.. టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం అనే తరహాలో ఆమె చేసిన వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. అయితే, అదే రేంజ్లో టీఆర్ఎస్ నుంచి కౌంటర్ ఎటాక్ స్టార్ట్ అయ్యింది.. ఈ నేపథ్యంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేవారు.. […]
సింగరేణి 561వ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. స్థానికులకే ఉద్యోగ అవకాశాలతో పాటు.. కొత్త ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది… సింగరేణి పరిధిలోని జిల్లాల వారికి శుభవార్త చెప్పారు సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్.. ఇకపై సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలు స్థానిక జిల్లాల వారికే ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. సింగరేణిలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్లాంట్ డీపీఆర్‌కు ఆమోదం లభించిందని ప్రకటించిన ఆయన.. మందమర్రిలో 50 వేల టన్నుల సామర్థ్యం గల […]
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌తో కలిసి పీకే పర్యటించారు.. అయితే, ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్‌ను తీసుకు వచ్చాడని ఎద్దేవా చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. అయితే, మీ (టీఆర్ఎస్ పార్టీ) ఓటమిని ఎవరూ ఆపలేరని పీకేనే చెప్పాడట అని వ్యాఖ్యానించారు. ఇక, రైతులతో చెలగాటం ఆటలాడితే మాడి […]
అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఆమె… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు.. ఈ రోజు రాష్ట్రంలోని ప్రతి పైసా సంపద తెలంగాణ ప్రజలదేనన్న ఆమె.. తెలంగాణ ప్రజల నెత్తిన కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల అప్పు పెట్టారంటూ ఆరోపించారు.. Read Also: […]
తెలంగాణలో పరిపాలన గాడి తప్పింది.. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. గవర్నర్ ఢిల్లీ పర్యటనపై స్పందించిన ఆయన.. సీఎం కేసీఆర్ తన కొడుకుని సీఎం చేయలేక తప్పించుకోవడం కోసం రాజ్ భవన్‌తో గొడవ పెట్టుకుంటున్నారు అని గవర్నర్ ఢిల్లీలో చెప్పారన్నారు రేవంత్‌రెడ్డి.. గవర్నర్ మీడియాతోనే చెప్పారన్నారు.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జీహెచ్ఎంసీ గవర్నర్ పరిధి అని.. గవర్నర్‌కి సెక్షన్ 8 ప్రకారం విశేష అధికారులున్నాయి.. పరిపాలన గాడి తప్పింది కాబట్టి.. […]