ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు.. ఇవాళ ఉదయం 11.31 గంటలకు మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నరు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్… దీనికోసం తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేశారు. ఇప్పటికే నూతనంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న శాసన సభ్యుల జాబితాకు గవర్నర్ ఆమోదం తెలిపారు.. వెలగపూడిలోని సచివాలయం ఆవరణలో మంత్రివర్గంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది.. తిరిగి ప్రమాణ స్వీకారం చేయనున్నారు 11 మంది పాత మంత్రులు.. మొత్తం 25 మందితో […]
* నేడు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ వర్చువల్ భేటీ, కోవిడ్, ఇండో-పసిఫిక్, క్వాడ్, ద్వైపాక్షిక అంశాలపై చర్చ * ఐపీఎల్లో నేడు హైదరాబాద్‌తో తలపడనున్న గుజరాత్.. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం.. రేపటి నుంచి సర్వదర్శన టోకెన్లు జారీని పునఃప్రారంభించనున్న టీటీడీ * నేడు ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం.. ఉదయం 11.31 గంటలకు మంత్రులతో ప్రమాణం చేయించనున్న గవర్నర్ బిశ్వభూషణ్ * […]
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఓవైపు పెరిగిపోతున్న పెట్రో ధరలు.. మరోవైపు హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలపై వ్యంగాస్త్రాలు విసిరారు.. ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రపంచంలో పెట్రోలు, డీజిల్ ధరల్లో దేశం అగ్రస్థానంలోకి దూసుకెళ్లిందంటూ ఎద్దేవా చేసిన ఆయన.. కొనుగోలు శక్తి సమానత్వం అంచనా ఆధారంగా ప్రపంచంలో భారత్‌లో ఎల్పీజీ ధరలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.. ఇక, పెట్రోలు […]
గ్రామాల్లో కరెంట్ పీకుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను.. సీఎం పదవి నుంచి పీకేందుకు జనం సిద్ధంగా ఉన్నారంటూ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తెలుగుదేశం పిలుపునిచ్చిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.. బాదుడే బాదుడు ఆందోళనల్లో భాగంగా త్వరలో క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేపట్టబోతున్నారు చంద్రబాబు, లోకేష్.. క్షేత్రస్థాయికి వెళ్లని నేతలను మార్చేందుకు కూడా వెనుకాడేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసిన చంద్రబాబు.. ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని కార్యక్రమంపై జరిపిన […]
హైదరాబాద్‌లో తరచూ డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి.. తాజాగా ఓ పంబ్ వ్యవహారం రచ్చగా మారింది.. పలువురు ప్రముఖుల పిల్లలను తప్పించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.. అయితే, ఇవాళ హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో పబ్ నిర్వాహకులతో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం నిర్వహించారు.. ఈ భేటీలో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పబ్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు శ్రీనివాస్ గౌడ్.. అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించిన ఆయన.. రాష్ట్ర […]
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గవర్నర్ తమిళిసై చుట్టూ తిరుగుతున్నాయి.. ప్రభుత్వంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. ఇక, కొందరు ఆమెను సపోర్ట్ చేస్తుంటే.. అధికార టీఆర్ఎస్ మాత్రం ఆమెను టార్గెట్ చేసి కౌంటర్ ఎటాక్ చేస్తోంది… తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్‌కి కూడా పరిమితులు ఉంటాయి… ప్రధాని, హోం మంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చింది..? అని […]
తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ.. విభేదాలు పక్కనబెట్టి.. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇక, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కలిసికట్టుగా పనిచేస్తామని నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.. మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిలపై […]
ఈ నెల 11వ తేదీన కొత్త కేబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.. కొత్త మంత్రుల ఎంపికపై సీఎం జగన్ తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు.. జిల్లాలు, సామాజిక సమీకరణలు, మహిళలు.. ఇలా అన్ని బేరీజు చేసేపనిలో ఉన్నారు.. అందరికీ మంత్రి పదవి కావాలని ఉన్నా.. అందరూ అధినేతపైనే భారం వేస్తున్నారు.. ఆశగా ఎదురుచూస్తున్నారు.. కేబినెట్ కూర్పు గురించి స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు… కేబినెట్ కూర్పు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం అన్నారు.. అసంతృప్తి అనే ప్రశ్నే […]
మంత్రులంతా రాజీనామా చేశారు.. ఇవాళో రేపో కొత్త మంత్రులను ఫైనల్ చేయనున్నారు.. దీనిపై తుది కసరత్తు చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.. అయితే, ఆశావహులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.. ఈ విషయంపై స్పందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… మంత్రివర్గంలో నాకు స్థానం ఉంటుందా లేదా అన్నది నాకు తెలియదు… కానీ, ఆశావహుల జాబితాలో నేను ఉన్నాను అన్నారు.. మంత్రి […]