తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన ఉగాది వేడుకలు పెద్ద చర్చగా మారిపోయాయి.. సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాకపోవడంపై.. గవర్నర్ తమిళిసై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. కొందరు బీజేపీ నేతలు కూడా డుమ్మా కొట్టారు.. దీనిపై పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.. అసలు రాజ్ భవన్లో ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి […]
ఉక్రెయిన్‌పై మళ్లీ భీకర యుద్ధం చేస్తోంది రష్యా… ఓవైపు చర్చలు అంటూనే.. అప్పుడప్పుడు తాత్కాలికంగా యుద్ధానికి బ్రేక్ ఇస్తున్న రష్యా బలగాలు.. అంతర్జాతీయంగా రోజురోజుకీ తీవ్రమైన ఆంక్షలు వస్తున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు.. మరోసారి ఉక్రెయిన్‌పై బాంబులపై వర్షం కురిపించింది.. తూర్పు ఉక్రెయిన్ను టార్గెట్ చేసిన రష్యా బలగాలు.. రైల్వేస్టేషన్‌పై రాకెట్ దాడులకి దిగింది.. ఈ ఘటనలు 30 మందికి పైగా పౌరులు మృతిచెందారని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది.. ఇక, 100 మందికి పైగా […]
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే విస్తృతంగా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ టీకాలు పంపిణీ జరగగా.. మరోవైపు బూస్టర్ డోస్ పంపిణీపై కూడా ఫోకస్ పెట్టింది కేంద్రం.. ఇప్పటివరకు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు మరియు 60+ ఏజ్ గ్రూప్ వారు ఇలా 2.4 కోట్ల కంటే ఎక్కువ మందికి బూస్ట్ డోస్ పంపిణీ జరగగా.. ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. అందరికీ వ్యాక్సిన్ అందించాలనే నిర్ణయానికి […]
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత వాదనలు వినేందుకు అంగీకారం తెలిపింది సుప్రీంకోర్టు… ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల వ్యవహారంపై తక్షణమే వాదనలు వినాలన్న అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా అభ్యర్థనతో ఈ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు… గత ఐదేళ్లుగా రాజకీయ నేతలపై 2 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత వ్యాజ్యంపై తక్షణమే విచారణ జరపాలని కోరుతూ సీజేఐ ధర్మాసనం […]
తెలంగాణ పర్యటనకు వచ్చిన మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా.. ఇవాళ మంత్రి కేటీఆర్‌ను కలిశారు.. ఉదయం ప్రగతి భవన్‌కు వచ్చిన సంగ్మా దంపతులను.. మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.. ఇక, వివిధ అంశాలపై కేటీఆర్, సంగ్మా మధ్య చర్చలు జరిగాయి.. మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలు, వ్యాపారాలపై ఐటీ మంత్రి చర్చించినట్లు సమాచారం. ఇక, ఈ సమావేశం విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ […]
విపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గ్రామ, వార్డు వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓ దొంగల ముఠా.. ఈ దొంగల ముఠా హైదరాబాద్‌లో ఉంటూ సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.. వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు అని పేర్కొన్న సీఎం జగన్.. గతంలో దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని […]
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆమె.. ఇవాళ హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమై.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, తనకు ఎదురైన అనుభవాలు, కేసీఆర్ ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలు.. తదితర అంశాలపై చర్చించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. నేను ఎవ్వరిని కించపరచటం లేదు.. కానీ, నన్ను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమిత్ షాతో అన్ని అంశాలపై చర్చించాను.. […]
మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఇక, ముగ్గురు, నలుగురు మినహాయిస్తే కేబినెట్ మంత్రులంతా రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది.. ఎవరు ఉంటారు.. ఎవరు కేబినెట్ నుంచి పార్టీ బాధ్యతల్లోకి వెళ్లినున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి ఆదిమూలపు సురేష్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం నా తల కోసుకోవటానికి కూడా సిద్ధం అని ప్రకటించారు.. ముఖ్యమంత్రివి ఉన్నత ప్రమాణాలు.. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయటానికి శాయశక్తులా పని […]
వేసవిలో మార్కెట్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ లో తాటి ముంజలు ఒకటి. పుచ్చకాయ, మామిడికాయ, కర్బూజతో పాటు సమానంగా ఇందులో పోషక విలువలు ఉంటాయి. జెల్ లాగా కనిపించే ఈ తాటి ముంజ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఎలాగంటే… అసలు ఈ ముంజలను ఎలా తినాలి? చాలా మంది ముంజలపై ఉండే పొట్టును తీసేసి తింటుంటారు. అసలు విషయమేమిటంటే… ఆ పొట్టులోనే చాలా పోషక విలువలు ఉంటాయి. ఇదే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. […]
ఈ మూడేళ్లలో సంతృప్తికరంగా పని చేశాను.. సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏ పని ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… ఇవాళే ఏపీలో పాత మంత్రులంతా రాజీనామా చేస్తారని తెలుస్తోన్న తరుణంలో.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే 90 శాతం మంత్రులను మారుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని.. ఆ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం అయ్యిందన్నారు.. ముఖ్యమంత్రి అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న […]