తెలంగాణ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య పలు అంశాలపై వివాదం నడుస్తూనే ఉంది.. వరద సాయంలోనూ తెలంగాణపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిందంటూ మరోసారి.. బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఎండగట్టారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. 2021-22లో తెలంగాణకు ఎలాంటి ఎన్డీఆర్ఎఫ్ నిధులు కేటాయించలేదంటూ ఓ నివేదికను ట్విట్టర్లో షేర్ చేశారు.. 2020లో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు సాయం అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని ఎమ్మెల్సీ […]
ఆంధ్రప్రదేశ్లో మంత్రులపై చర్చ జరుగుతోన్న సమయంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా దిగిపోతున్నానని, తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు.. గతంలో తమ్ముడు ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు… నరసన్నపేట ఉపఎన్నికలో తనపై మరో సోదరుడు రామదాసును బరిలోకి దించాడని.. ఆ ధర్మ యుద్ధంలో తానే గెలిచానని కృష్ణదాస్ గుర్తుచేసుకున్నారు.. 2019 ఎన్నికల్లో తమ్ముడు ప్రసాదరావు కూడా వైసీపీ నుంచి పోటీ చేశారు.. ఎన్నికల్లో ఇద్దరం గెలిచామని చెప్పారు. […]
ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఉండేది ఎవరు..? ఊడేది ఎవరు..? కొత్తగా వచ్చేది ఎవరు..? ఎవరికి ఏ శాఖ..? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. అయితే, మా తలరాతలు మార్చేది సీఎం జగనే అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… ఇన్నాళ్లూ మంత్రిగా చేయడం నా అదృష్టంగా తెలిపారు.. రాజీనామా చేయమని సీఎం జగన్ ఆదేశిస్తే.. ఆయన కాళ్ల ముందు తల వంచి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మళ్లీ మంత్రిగా అవకాశం కల్పిస్తారనే […]
ఉక్రెయిన్ రాజధానికి అడ్డుగోడగా నిలిచిన బుచా సిటీని సర్వనాశనం చేసింది రష్యా. వందలాది మందిని ఊచకోత కోసింది. ఈ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ప్రపంచ దేశాలు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధ నేరాలకు పాల్పడుతున్న పుతిన్ దర్యాప్తును ఎదుర్కోవాల్సిందే అని హెచ్చరిస్తున్నాయి. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా, యూరప్ సిద్ధమయ్యాయి. బుచా ఘటనలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమైంది. ఐక్యరాజ్యసమితిలో బుచా మరణాలపై స్వతంత్ర దర్యాప్తునకు భారత్ కూడా మద్దతు తెలిపింది. బుచా […]
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగబోతోంది.. ఒక రకంగా ఇదే చివరి కేబినెట్.. ఈ సమావేశం తర్వాత ముగ్గురు, నలుగురు మినహా మిగతావారంతా రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది. కేబినెట్ భేటీలోనే దీనిపై క్లారిటీ రాబోతోంది. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… నేను మళ్లీ మంత్రి కావాలనే ఆశ లేదన్న ఆయన.. ఎల్లకాలం వైఎస్ జగన్ సీఎంగా ఉండాలనేదే నా కోరిక.. డిప్యూటీ సీఎం పదవి […]
కాంగ్రెస్ పార్టీ పోరు బాట పడుతోంది.. తెలంగాణలో పెరిగిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనకు పిలుపు నిచ్చింది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి ర్యాలీ చేపట్టి, విద్యుత్ సౌధ ముట్టదించాలని నిర్ణయించింది. ఉదయం 10.30 నిమిషాలకు పార్టీ నాయకులు అంతా ఇందిరా గాంధీ విగ్రహం వరకు చేరుకోనున్నారు. అక్కడి నుండి విద్యుత్ సౌధ ముట్టడికి వెళ్తారు. పార్టీ ముఖ్య నాయకులు అంతా ఈ ముట్టడిలో పాల్గొనాలని పీసీసీ ఆదేశించింది. జిల్లాల వారిగా కూడా […]
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హస్తిన టూర్ పొలిటికల్ హీట్ పెంచుతోంది… కొంత కాలంగా తెలంగాణ సర్కారుకు గవర్నర్ మధ్య కొనసాగుతున్న గ్యాప్ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత ఢిల్లీలో గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. యాసంగి ధాన్యం కేంద్రం కొనాల్సిందేనంటూ.. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న టీఆర్ఎస్.. అటు ఢిల్లీలోనూ దీక్షకు సిద్ధమవుంది. సీఎం కేసీఆర్ ధర్నాలో పాల్గొంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో ఇటు తెలంగాణ బీజేపీ […]
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తీరు మారడం లేదు.. ఈ సీజన్లో ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది.. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. 16 ఓవర్లు ఆడిన కోల్కతా ఇంకో నాలుగు ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ను ముగించింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ ప్యాట్ కమిన్స్ హాఫ్ సెంచరీలతో రాణించారు. కమిన్స్ కుమ్మేశాడు. ఆఖరిలో వచ్చి బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. సిక్సుల వర్షం కురిపించాడు. మ్యాచ్ […]