భారత రాష్ట్రపతి ఎన్నికల్లో మరో కీలక ఘట్టం ముగిసింది.. గురువారం రోజు నామినేషన్ల పరిశీలన పూర్తి చేసిన ఎన్నికల సంఘం అధికారులు.. ప్రమాణాలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరించారు.. రాష్ట్రపతి ఎన్నికల ప్రధానంగా బరిలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలకు ఓకే చెప్పారు.. దీంతో.. ఈ నెల 18వ తేదీన జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల బరిలో ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా బరిలో మిగిలినట్టు అయ్యింది.. అయితే, నామినేషన్ల ఆఖరి రోజైన బుధవారం వరకు 94 మంది 115 నామినేషన్లు వేశారని.. ప్రమాణాల మేరకు లేని కారణంగా వాటిలో 107 నామినేషన్లను తిరస్కరించామని వెల్లడించారు రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ. ఇక, ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో అన్ని వివరాలు పొందుపర్చారని.. అందుకే వాటిని ఆమోదించినట్టు తెలిపారు..
Read Also: LIVE: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీకు జీవితాంతం డబ్బుకు లోటు ఉండదు
మరోవైపు, రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ రేపు (జులై 2వ తేదీ) మధ్యాహ్నంతో ముగియనుండగా.. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫైనల్‌గా ఎన్నికల బరిలో నిలిచినవారి జాబితాను విడుదల చేయనున్నారు.. అయితే, ఈ ఎన్నికల్లో ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాతో పాటు.. పలువురు సామాన్యులు కూడా నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే కాగా.. ఫైనల్‌గా బరిలో నిలిచేది ఎవరు? అనే విషయం రేపు తేలిపోనుంది. ఇక, రాష్ట్రపతి ఎన్నికలను అధికార పక్షంతో పాటు.. ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. ఎన్నికల ప్రచారానికి కూడా తెరలేపారు అభ్యర్థులు.. ఇవాళ హైదరాబాద్ రానున్నారు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. తనకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించనున్నారు.