జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పలు సందర్భాల్లో తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్.. మరోసారి జనసేనానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయలేని పవన్ కల్యాణ్… భీమ్లా నాయక్ కాదని తెలుగుదేశం పార్టీ వద్ద బిచ్చం అడుక్కునే బిచ్చ నాయక్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. Read Also: VH: మళ్లీ సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసిన వీహెచ్.. చెప్పినా పట్టించుకోరా..? పవన్ […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఎలాంటి విబేధాలు ఉండకూడదు.. అంతా కలిసి కట్టుగా పనిచేయాలి.. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ అధిష్టానం, రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేశారు.. కానీ, మరోసారి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు.. ఆయన విమర్శలకు ప్రధాన కారణం అంబేద్కర్ విగ్రహమే.. అంబేద్కర్ విగ్రహం పోలీసులు ఎత్తుకు పోయారు అని కేసులు పెట్టినా.. ఇప్పటి వరకు చార్జిషీట్ వేయలేదని […]
తెలంగాణలో తమ వాహనాలపై పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన భారీ డిస్కౌంట్ ఆఫర్ ముగియవచ్చింది.. ఈ నెల 15వ తేదీతో ముగియనుంది.. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం విధించిన ట్రాఫిక్ జరిమానాలపై ఇచ్చిన డిస్కౌంట్‌కు ఇక మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది.. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం విధించిన ట్రాఫిక్ జరిమానాలపై ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న చలాన్లకు ఇచ్చిన డిస్కౌంట్ క్లియర్ చేసే సమయం 15-4-2022 సాయంత్రంతో ముగుస్తుంది. ఇకపై […]
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి.. ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు.. అయితే, తెలంగాణలో వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని.. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.. ఇక, ఎల్లుండి ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో వర్షం పడుతుందని.. ఈ […]
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇక, టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఈ తరుణంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ కుక్కలు.. రైతులను వరి వేయాలని చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా బూట్లు నాకి.. బండి సంజయ్.. […]
కరోనా మహమ్మారి శ్రీవారిని దర్శన విదానాన్ని కూడా మార్చేసింది.. ప్రత్యేక దర్శనం అయినా.. సర్వదర్శనం అయినా టికెట్లు తప్పనిసరి చేసింది టీటీడీ… కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శనం కల్పించేందుకు వీలుగా.. ఆన్లైన్లో కోటా పెట్టి దర్శనం కల్పిస్తూ వస్తోంది.. శ్రీవారి సర్వదర్శన టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.. సర్వదర్శనం టికెట్లు ఇచ్చే క్యూ లైన్ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.. వేలాది మంది ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది.. ఓ దశలో తొక్కిసలాట కూడా […]
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు మరోసారి రైతుల నుంచి నిరసన సెగ ఎదురైంది.. ఈ సారి ఏకంగా అర్వింద్ ఇంటిని ముట్టడించారు రైతులు.. ఆర్మూర్‌లోని అర్వింద్ నివాసం ముందు వడ్లను పారబోసి నిరసన చేపట్టారు రైతులు.. జిల్లా నలుమూలనుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన రైతులు.. బీజేపీ నేతలు చెబితేనే వరి వేశాం.. కాబట్టి ఎప్పటిలాగానే కొనుగోలు కేంద్రాల […]
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ కలిసి రైతులను దగా చేస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.. ఇక, ఢిల్లీ వేదికగా జరిగిన నిరసన దీక్షలు.. కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల డెడ్‌లైన్ పెట్టారు సీఎం కేసీఆర్.. 24 గంటల్లో వరి కొనుగోళ్లపై తేల్చకపోతే.. తామే ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఇదే సమయంలో.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం […]
గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో జరిగిన శ్రీరామ నవమి హింసాత్మక ఘటనలపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. విద్వేషం, హింస భారత దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సౌభ్రాతృత్వం, శాంతి, సామరస్యంతో కూడిన పునాదులు పురోగతికి మార్గం వేస్తాయన్నారు. భిన్న సంస్కృతి, సమ్మిళిత భారతదేశాన్ని కాపాడుకునేందుకు కలిసి నిలబడాలని ట్వీట్ చేశారు. శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా మధ్యప్రదేశ్ ఖార్గోన్ నగరంలో అల్లర్లు చెలరేగాయి. కనీసం 10 ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో […]
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇలా విరుచుకుపడ్డ మహమ్మారి.. మళ్లీ ఫోర్త్ వేవ్ రూపంలో మళ్లీ పంజా విసురుతుందా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. భారత్‌లో దేశంలో మళ్లీ కరోనా కొత్త వేరియంట్ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎక్స్ఈ వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో వెలుగు చూశాయి. మరోసారి కరోనా వ్యాప్తిపై ఆందోళన రేగడంతో కోవిడ్ వర్కింగ్ గ్రూప్ స్పందించింది. కొత్త వేరియంట్‌పై భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. తీవ్ర […]