సీజన్ మారిపోయింది.. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.. ఏది వైరస్.. ఏది సీజనల్ అనే అనుమానాలు ప్రజలను వెంటాడుతున్నాయి.. ఈ తరుణంలో సీజనల్ వ్యాధులపై మూడంచెల వ్యూహం అవలంభించాలని అధికారులకు సూచించారు మంత్రి హరీష్‌రావు.. సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించిన హరీష్‌రావు.. ప్రజల్లో అవగాహన, పరీక్షలు చేయడం, చికిత్స అందించడం వ్యూహంగా సాగాలన్నారు.. అవసరం అయిన చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.. స్కూల్స్, హాస్టల్స్ లో పారిశుద్ధ్యం, భోజనం విషయంలో జాగ్రత్త తీసుకోవాలని ఆదేశించిన ఆయన.. పరిసరాల పరిశుభ్రత, దోమల నియంత్రణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Read Also: Shiv Sena: ఇప్పుడు ఎన్నికలు జరిగినా శివసేకు 100 సీట్లు..!
ఇక, పంచాయతీ రాజ్ సహా, ఇతర శాఖలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి హరీష్‌రావు.. కరోనా, సీజనల్ వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉంటాయి.. పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అయితే, స్వరాష్ట్రంలో క్రమంగా తగ్గిన సీజనల్ వ్యాధుల ప్రభావం తగ్గిందన్నారు హరీష్‌రావు.. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం, అనుసరించిన విధానాలు ఫలించాయన్నారు.. పల్లె ప్రగతి, డంపింగ్ యార్డులు, గ్రామానికి ఒక ట్రాక్టర్ ఏర్పాటు లాంటివి మంచి ఫలితాలు ఇస్తున్నాయని వెల్లించారు.. మలేరియా రహిత రాష్ట్రంగా తెలంగాణ అడుగులు వేస్తున్నట్లు కేంద్రం నుండి ప్రశంసలు దక్కాయని.. ఏటూరు నాగారం, ఉట్నూర్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ ఐటిడిఏల పరిధిలోని జిల్లాల్లో సీజనల్ వ్యాధులపై నిర్వహించిన సమీక్షలోతెలిపారు మంత్రి హరీష్‌రావు.