ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో చోటు దక్కించుకున్న ధర్మాన ప్రసాదరావు.. కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా నియమితులయ్యారు.. ఇక, ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన ప్రసాదరావు.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. సీఎం వైఎస్ జగన్ లక్ష్యాలు నెరవేరుస్తామని ప్రకటించారు.. రెవెన్యూ అని కాకుండా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే బావుండేదన్న ఆయన.. సీనియర్ అధికారులతో కలిసి ఒక టీంగా పని చేయడం నా అలవాటు అన్నారు.. అనేక చట్టాల వల్ల చాలా భూములు వివాదాల్లో చిక్కుకుంటాయి.. దీని […]
ప్రతీ గింజను కొనాల్సింది సీఎం కేసీఆరేనని డిమాండ్ చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. దాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్వి డ్రామాలు అని మండిపడ్డారు.. ఇప్పటికే 50 శాతం ధాన్యం రైతులు అమ్ముకున్నారని.. మిల్లర్లకు అమ్మిన రైతులకు కూడా మద్దతు ధర ఇవ్వాలని సూచించారు.. గవర్నర్తో భేటీకి ముందు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. గవర్నర్ దృష్టికి అన్ని సమస్యలు తీసుకెళ్తాం అన్నారు.. ప్రభుత్వంపై భారం మూడు వేల కోట్ల అని మేం మొదటి నుండి చెబుతున్నాం.. అయినా […]
ఉక్రెయిన్పై రష్యా దాడులను చూస్తే.. వారం పది రోజుల్లో ఉక్రెయిన్ మొత్తం రష్యా ఆధీనంలోకి వస్తుందనే అంచనాలు మొదట్లో కనబడ్డాయి.. కానీ, ఉహించని రీతిలో ఉక్రెయిన్ నుంచి ఎదురుదాడి జరుగుతూనే ఉంది.. అయితే, రష్యా వైఫల్యాలకు సొంత నిఘా వ్యవస్థల్లోని గూఢచారులే కారణమని అనుమానిస్తున్నారు పుతిన్. అందుకే దాడికి ముందే రష్యా ప్లాన్ల బ్లూప్రింట్లు అమెరికా, యూకేలకు చేరాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. దీంతో సన్నిహతులు అని కూడా చూడకుండా నిఘా విభాగం అధికారులపై కఠిన చర్యలు […]
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసుల్లో ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం.. ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన 2012 కేసుల్లో తీర్పు వెల్లడించనుంది.. కాగా, పదేళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్బరుద్దీన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ కేసు నమోదు చేశారు.. ఇక, ఈ కేసులో నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ ముగించింది.. ఈ కేసులో 30 మందికిపైగా సాక్షులను విచారించింది కోర్టు.. అదే విధంగా ఆ […]
తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్కు కారణమైన ఒమిక్రాన్ వేరియంట్ మ్యుటేట్ అవుతోంది. కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ ఉత్పరివర్తనం చెందుతూ అనేక కొత్త వేరియంట్ల సృష్టికి కారణమవుతోంది. అందులో భాగంగానే ఏర్పడిన బీఏ.2 అనే ఉపరకం 95 శాతానికిపైగా ప్యూరిటీ ఉన్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే తాజాగా మరో రెండు కొత్త వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 సౌతాఫ్రికాలో బయటపడ్డాయి. దీంతో అలర్ట్ అయిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ […]
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలపై గవర్నర్ని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్. ఇవాళ ఉదయం రాజభవన్లో గవర్నర్ తమిళ సైతో సమావేశం కానున్నారు. దానికి ముందు… కాంగ్రెస్ నాయకులు సీఎల్పీ వద్ద సమావేశమై గవర్నర్ కార్యాలయానికి బయలుదేరుతారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో 28 మంది సభ్యుల బృందం గవర్నర్ తో భేటీ అవుతారు. రాష్ట్రంలో మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని కోరనుంది కాంగ్రెస్ పార్టీ. Read Also: Ukraine […]
అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు ఎదురైనా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది.. ఇరు దేశాల మధ్య యుద్ధం 48వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్లో పలు ప్రాంతాలపై ఇంకా రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా తన దాడులను కీవ్ నుంచి తూర్పు ఉక్రెయిన్ వైపు కేంద్రీకృతం చేసింది. పోర్టు సిటీ మరియుపోల్ పై నియంత్రణ సాధించే లక్ష్యంతో రష్యన్ దళాలు ముందుకు సాగుతున్నాయి. కాగా వారిని అడ్డుకునేందుకు, తమ భూభాగాన్ని […]
సాధారణంగా భార్యను భర్తలు హత్య చేసిన ఘటనలు ఎక్కువగా చూస్తుంటాం.. కానీ, పరిస్థితులు మారిపోయాయి.. భార్తలే భర్తలను దారుణంగా హత్య చేసిన ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.. జనగామ జిల్లాలో భర్తను దారుణంగా చంపింది భార్య. తండ్రి, మైనర్ కొడుకుతో కలిసి భర్త కళ్లల్లో కారం కొట్టి కత్తితో దాడిచేసింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హైదరాబాద్లోని పార్షిగుట్టకు చెందిన హనుమాండ్ల వినోద్, జనగామలోని అంబేద్కర్ నగర్లో నివాసముంటున్న మంజులను రెండేళ్ల క్రితం రెండో […]
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు శాంతి చర్చలు అంటూనే.. మరోవైపు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆంక్షలు ఎదురవుతున్నా.. యుద్ధం కొనసాగిస్తోంది రష్యా.. ఈ నేపథ్యంలో చాలా సంస్థల ఆ దేశానికి గుడ్బై చెప్పేస్తున్నాయి.. తాజాగా, రష్యాకు ప్రముఖ టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా షాక్ ఇచ్చింది. రష్యా మార్కెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై రష్యా విపణిలో తమ ఉత్పత్తులను విక్రయించబోమని తేల్చి చెప్పింది. ఫిన్లాండ్కు చెందిన ఈ దిగ్గజ కంపెనీ.. […]
గోదావరి ఉప నది ప్రాణహిత పుష్కరాలు ఇవాళ మొదలు కానున్నాయి. మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం రానుంది. చైత్రశుద్ధ ద్వాదశి నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి అంటే ఈ నెల 24 వరకు 12 రోజుల పాటు ప్రాణహిత పుష్కరాలు జరగనున్నాయి. కాళేశ్వరం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3.54 గంటలకు పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. కొమురంభీం జిల్లా కౌటాల, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా […]