భారత మార్కెట్‌లోకి లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ అయిన డుకాటీ నుంచి మరో కొత్త స్పోర్ట్స్ బైక్ ఎంట్రీ ఇచ్చింది.. డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్పీ పేరుతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ బైక్ ఫీచర్లు అదిరిపోగా.. ధర కూడా అదే రేంజ్‌లో ఉంది.. సూపర్‌బైక్స్ తయారీలో ఉన్న ఇటలీ సంస్థ డుకాటీ.. స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్‌పీ స్పోర్ట్ నేక్డ్ పేరుతో భారత్‌లో విడుదల చేసిన ఈ కొత్త బైక్‌కు సంబంధించిన బుకింగ్‌లు, డెలివరీలను కూడా ప్రారంభించింది. ఈ బైక్ ఎక్స్‌షోరూం ధర రూ.34.99 లక్షలుగా ఉంది.. ఇక, ఫీచర్లను పరిశీలిస్తే 1,103 సీసీ లిక్విడ్-కూల్డ్, డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్ అమర్చారు.. సింగిల్ సీట్, కార్బన్ హీల్ గార్డ్స్‌తో అడ్జస్టబుబుల్ రైడర్ ఫుట్ పెగ్స్, 3 రైడింగ్ మోడ్స్, ఏబీఎస్ కార్నరింగ్ బాష్, ట్రాక్షన్ కంట్రోల్ ఈవో 2, స్లైడ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, పవర్ లాంచ్, క్విక్ షిఫ్ట్ అప్/డౌన్ వంటి హంగులతో రూపుదిద్దుకుంది.
Read Also: Business Updates: ఈ రోజు బిజినెస్ వార్తలు..
డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్పీ వెర్షన్‌లో వస్తుంది.. ఎస్పీ అంటే స్పోర్ట్ ప్రొడక్షన్ మరియు మోటర్‌సైకిల్‌తో ప్రత్యేకమైన లివరీ, సూపర్‌లెగ్గేరా వీ4 నుండి తీసుకోబడిన ప్రీమియం పరికరాలు, అలాగే నియంత్రిత బరువుతో.. రన్నింగ్ ఆర్డర్‌లో 196.5 కిలోలు (స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్‌తో పోలిస్తే 2.5 కిలోలు తక్కువ)గా ఉంటుంది.. మరింత తేలికగా దీనిని డ్రైవ్ చేయవచ్చు.. ప్రత్యేకమైన Brembo Stylema R ఫ్రంట్ బ్రేక్ కాలిపర్‌లు అసాధారణ బ్రేకింగ్ పవర్‌ను అందిస్తాయి.. ఇది ఈవెంట్-ఆధారిత సిస్టమ్‌తో కూడిన Öhlins స్మార్ట్ EC 2.0ని కూడా కలిగి ఉంది, రైడర్ యొక్క రైడింగ్ స్టైల్‌ను బట్టి డంపింగ్‌ను మారుస్తుంది. స్పోర్టీ ఉపయోగంలో అత్యుత్తమ పనితీరును నిర్ధారించినట్టు చెబుతున్నారు..