Viral: ఐదేళ్ల బాలుడిపై క్రూరత్వం.. ఏంది సారు ఇది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యా బుద్ధులు నేర్పి విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన ఓ ఉపాధ్యాయుడు క్రూరుడిగా మారిపోయాడు.. ఐదేళ్ల బాలుడిపై కిరాతంగా ప్రవర్తించాడు.. కర్రతో కొట్టి, చెంపలు వాయించి, పిడిగుద్దులు గుద్ది, కిందపడిపోయినా.. కనీసం కనికరం లేకుండా కర్కశంగా ప్రవర్తిస్తూ.. ఐదేళ్ల బాలుడిని చిత్ర హింసలకు గురిచేశాడు.. బీహార్‌లో జరిగిన ఈ దారుణమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోగా.. నిందితుడైన యువకుడిపై మండిపడుతున్నారు నెటిజన్లు..
Read Also: Birthday Poster: ‘విక్రమ్ గౌడ్’ కోసం రగ్గడ్ లుక్ తో కిరణ్ రాజ్!
Also Read
- Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీర్ ఒరియా ప్రాంతంలో జయ పేరుతో కోచింగ్ సెంటర్ నడుస్తోంది.. ఆ సెంటర్‌లో చోటు అనే యువకుడు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండగా.. తాజాగా, ఓ ఐదేళ్ల బాలుడి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు.. సరిగ్గా చదవడం లేదన్న కారణంతో విచక్షణారహితంగా ప్రవర్తించాడు.. ఆ బాలుడి పిరుదులపై కర్రతో దారుణంగా కొట్టాడు.. ఆ బాలుడు ఏడుస్తున్నా.. కొట్టొద్దని ప్రాదేయపడినా కనికరం చూపలేదు.. ఆ కర్ర విరిగేదాగా కొట్టాడు.. అంతటితో ఆగకుండా చెంపలు వాయించాడు.. ఆ తర్వాత బాలుడిపై పిడిగుద్దలతో విరిచుకుపడ్డాడు.. నెలపై పడిపోయినా వదలకుండా.. గట్టిగా అరిస్తూ చిత్ర హింసలకు గురిచేశాడు.. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన ఆ బాలుడు స్పృహ తప్పి పడిపోయాడంటే.. ఆ ఉపాధ్యాయుడు ఎంత క్రూరంగా ప్రవర్తించాడో అర్థం చేసుకోవచ్చు.. ఇక, సమాచారం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రలు.. వెంటనే ఆ కోచింగ్ సెంటర్‌కు చేరుకుని బాలుడిని ఆస్పత్రికి తరలించారు.. ఆ తర్వాత నిందితుడిపై దాడి చేశారు.. వారి దాడిలో నిందితుడైన టీచర్ చోటుకు కూడా తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది.. అయితే, బాలుడి పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఆ వీడియోను అక్కడ పనిచేసే ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. వైరల్‌గా మారిపోయింది.
తాజావార్తలు
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!