పాకిస్థాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది నేషనల్ అసెంబ్లీ.. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి షహబాజ్ షరీఫ్ ప్రసంగించారు. పాకిస్థాన్‌కు చైనా, సౌదీ, టర్కీ స్నేహితులని చెప్పుకొచ్చారు. చైనా సహకారంతో ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టిస్తామన్నారాయన. అయితే, భారత్, అమెరికాలతో సత్సంబంధాలు ముఖ్యమే అన్నారు షరీఫ్. తాము భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నా… కశ్మీర్‌కు శాంతియుత పరిష్కారంతోనే అది సాధ్యమన్నారాయన. ప్రతి అంతర్జాతీయ వేదికపైనా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతామన్నారు పాక్ కొత్త ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇక, కశ్మీర్లో […]
ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, అభినవ్ మనోహర్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయ్యారు. హార్ధిక్ పాండ్యా 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మనోహర్ 35, మాథ్యూ వేడ్ 19 పరుగులు చేశారు. సన్ రైజర్స్ […]
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మీటింగ్ జరగనుంది. ఈ నెల 3న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్… నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అయిన యాసంగి వడ్ల కొనుగోళ్లపైనే కేబినెట్ లో ప్రధాన చర్చ జరగనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచే యాసంగి వడ్లు మార్కెట్లకు రావడం మొదలైంది. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని చెప్పినందున తాము కూడా యాసంగి వడ్లు […]
ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రైతు సంక్షేమ యాత్రలో భాగంగా ధర్మవరం, బత్తలపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్న ఆయన.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు.. అంతేకాదు.. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయనున్నారు జనసేనాని.. సత్యసాయి, అనంతపురం జిల్లాలోని ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి వారిలో ధైర్యం నింపేందుకు రైతుల కోసం తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను మొట్టమొదటగా పవన్ కళ్యాణ్.. ఇవాళ […]
శ్రీకాకుళం జిల్లాలో సంభవించిన రైలు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు.. జి. సిగడాం మండలం బాతువ – చీపురుపల్లి రైల్వే స్టేషన్ మధ్య ఈ దుర్ఘటన జరిగింది.. గౌహతి వైపు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక లోపం వల్ల అక్కడ నిలిచిపోయింది. కొందరు ప్రయాణికులు రైలు దిగి ప్రక్కన పట్టాలపై నిలబడి ఉండగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వారిపై నుంచి దూసుకెళ్లింది.. దీంతో.. రైలు పట్టాలపై నిలిచినున్నవారు మృతిచెందారు.. పలువరు గాయాలపాలయ్యారు.. ఘటనా స్థలంలో చెల్లా చెదురుగా మృతదేహాలు పడిపోయాయి.. […]
* నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం… ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ.. వరి కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్ * భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు గవర్నర్ తమిళిసై పర్యటన.. దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామంలోని కొండరెడ్లను కలవనున్న గవర్నర్, 3 గంటల పాటు గ్రామంలోని గిరిజనులతో గడపనున్న గవర్నర్ * నేడు అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. రైతు సంక్షేమ యాత్రలో భాగంగా ధర్మవరం, […]
దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో అతిపెద్ద వాటాదారుగా అవతరించిన ఆయన.. ఇక, ట్విట్టర్ యాజమాన్య బోర్డులో చేరడం ఖాయమని అంతా భావించారు.. కానీ, ట్విట్టర్ యాజమాన్య బోర్డులోకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు ఎలాన్ మాస్క్.. ఈ విషయాన్ని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ప్రకటించారు.. ట్విట్టర్లో ప్రస్తుతం ఎలాన్ మస్క్‌కు 9.2 శాతం వాటా ఉంది… ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డార్సీ వాటాల కంటే కూడా […]
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూయడంతో.. ఆయన ప్రతినిథ్యం వచ్చింది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరు? మరోసారి గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి రంగంలోకి దిగుతారా? లేదా గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన భార్య కీర్తి పోటీ చేస్తారా? ఆ ఫ్యామిలీ మళ్లీ కేబినెట్ పదవి దక్కుతుందా? అనే చర్చ జోరుగా సాగింది.. అయితే, ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి రెండో కుమారుడు, […]
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది.. పాత మంత్రులతో జరిగిన చివరి కేబినెట్ సమావేశంలో.. అందరితో రాజీనామాలు చేయించిన సీఎం వైఎస్ జగన్.. పాత కొత్త మంత్రుల కలయికతో ఆదివారం రోజు తన కొత్త టీమ్‌ను ప్రకటించారు.. ఇక, ఇవాళ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. 25 మంది కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.. ప్రమాణ స్వీకార ఘట్టంలో మొదట సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం […]
వరి కొనుగోళ్ల విషయంలో ఢిల్లీపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ హస్తినలో నిరసన దీక్షకు దిగారు.. ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం ప్రకటించిన ఆయన.. కేంద్ర సర్కార్‌కు 24 గంటల డెడ్‌లైన్ పెట్టారు.. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏంటి..? అని ఫైర్ అయిన ఆయన.. రైతులను కన్నీరు పెట్టిస్తే, గద్దె దించే సత్తా రైతులకు ఉందని హెచ్చరించారు. రైతుల ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఎవరికి అధికారం శాశ్వతం కాదు.. కేంద్రానికి […]