ఇవాళ కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.. ఇక, ఈ రోజు కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్మ.. సీతారాములకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.. కాగా, కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆంక్షలు నేపథ్యంలో సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేకుండా పోయింది.. కానీ, ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉండడంతో.. ఈ ఏడాది భక్తుల సమక్షంలో రాములోరి కళ్యాణోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ.. ఇవాళ […]
* ఐపీఎల్లో నేడు హైదరాబాద్‌తో తలపడనున్న కోల్‌కతా.. ముంబైలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * తిరుమలలో రెండో రోజు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు.. ఇవాళ స్వర్ణరథంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం * నేడు కడపలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం.. కోదండరామస్వామికి పట్టా వస్త్రాలు సమర్పించనున్న సీఎం వైఎస్ జగన్ * ఇవాళ తిరుమలలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పర్యటన.. శ్రీవారిని దర్శించుకోన్న గవర్నర్ * నేడు విశాఖకు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. ఈ […]
అన్ని చార్జీలు మోత మోగుతున్నాయి.. కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేకుండా వరుసగా అన్ని చార్జీలు పెంచేస్తున్నాయి.. ముఖ్యంగా పెట్రో చార్జీల పెంపు ప్రభావం అన్నింటిపై పడుతోంది.. ఇప్పటికే తెలంగాణలో ఈ మధ్యే రెండు సార్లు ఆర్టీసీ చార్జీలు వడ్డించారు.. పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో ఇది తప్పలేదని పేర్కొన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆర్టీసీ చార్జీల వడ్డనకు రంగం సిద్ధం అయ్యింది.. డీజిల్ ధరల పెరుగుదలతో ఛార్జీలు పెంచేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది.. బస్సు ఛార్జీల పెంపునకు […]
కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు మంత్రి హరీష్ రావు.. సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు రేవంత్, కోమటి రెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయిన ఆయన.. కాంగ్రెస్ పార్టీకి ఏం చూసి ఓట్లు వేయాలి..? అని ప్రశ్నించారు.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. భవిష్యత్ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సెటైర్లు వేశారు.. ఇక, కష్టమైన సీఎం కేసీఆర్ రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తూ వడ్లు కొంటున్నారని ప్రశంసలు కురింపిచారు.. […]
ప్రతీ జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని.. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలని ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్.. రైతుల నుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ […]
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్.. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసిన ఆయన.. వివిధ అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై మండిప్డడారు.. కేసీఆర్ అంత అవినీతి పాలన ఇప్పటి వరకు చూడలేదన్న ఆయన.. కేసీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయం అని జోస్యం చెప్పారు.. ఏడేళ్లలో 8 లక్షల కోట్ల సొమ్ము ఏమైందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రజాశాంతి పార్టీ తరపున […]
మరో 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లి రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసిన ఆయన.. సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై ఫిర్యాదు చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజా పరిస్థితులపై గవర్నర్ కు నివేదిక ఇచ్చామన్నారు.. రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం వల్ల 30శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు.. […]
సీఎం వైఎస్ జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను.. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు మంత్రి ఆర్కే రోజా… సచివాలయంలోని రెండో బ్లాకులోని టూరిజం మంత్రి శాఖ చాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.. బాధ్యతలు స్వీకరించే ముందు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి వచ్చారు.. బాధ్యతలు స్వీకరించేముందు గుమ్మడికాయతో దిష్టి తీశారు రోజా భర్త సెల్వమణి.. మంత్రి చాంబర్లో చైర్లో కూర్చొన్న తర్వాత తల్లికి ముద్దు పెట్టారు రోజా కూతురు… ఇక, ఈ […]
ఈ ఏడాది డిసెంబర్‌కి హైదరాబాద్‌లో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం పనులు పూర్తి అవుతాయని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్… ట్యాంక్ బండ్ దగ్గర నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరి రక్షణ కోసం పాటు పడే వారికి అంబేద్కర్ ఆదర్శం అన్నారు.. ప్రపంచంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్‌లో నిర్మాణం అవుతుంది.. ఎనిమిది […]
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ అధికార పార్టీలోని అసంతృప్తులను బయటపెట్టింది.. కేబినెట్లో స్థానం కోల్పోయినవారిని, పదవి ఆశించి నిరాశ ఎదురై అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీ అధిష్టానం బుజ్జగించి.. మళ్లీ అందరినీ లైన్లోకి తీసుకొచ్చింది.. అయితే, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అలియాస్ ఆర్కే కూడా పదవి ఆశించారని.. మంత్రి పదవిరాకపోవడంతో అలకబూనారనే వార్తలు వచ్చాయి.. దీనిపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే ఆర్కే.. నేను మంత్రి పదవి ఆశించలేదని స్పష్టం చేసిన ఆయన.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో […]