తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి.. దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభణ కొనసాగుతుండగా.. రాష్ట్రంలోనూ క్రమంగా కేసులు సంఖ్య పైకి కదులుతోంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. 550 మార్క్‌ను కూడా దాటేశాయి రోజువారి పాజిటివ్ కేసులు.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 552 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 8,03,374కు చేరింది.. ఇదే సమయంలో 496 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 7,94,510కు పెరిగింది.. తాజాగా మరణాలు నమోదు కాలేదు.. కానీ, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడి 4,111 మంది మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,753 యాక్టివ్ కేసులు ఉన్నాయని, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,913 శాంపిల్స్ పరీక్షించినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 316 కేసులు వెలుగుచూశాయి.
Read Also: KCR: భూ సమస్యలపై ఫోకస్.. 15 నుంచి రెవెన్యూ సదస్సులు