ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్ను బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ప్రారంభించారు… అనంతరం కీలక ప్రకటన చేశారు.. 131 మంది ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు సీఎం వైఎస్ జగన్.. గతంలో బలభద్రపురంలో కాలుష్య పరిశ్రమ వద్దంటూ కేపీఆర్ వ్యతిరేక ఉద్యమం జరిగింది.. ఈ సందర్భంగా 131 మందిపై […]
ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేవన్నీ గాలి మాటలు మాత్రమే.. పెంచిన గ్యాస్ ధరలకు మోడీకి దండం పెట్టాలన్నారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో పైపుల ద్వారా ఇంటింటికీ నేచురల్ గ్యాస్ పంపిణీ ప్రారంభించాం.. నర్సంపేటలో తక్కువధరకు 12,600 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం.. ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచిన నర్సంపేటలో అభివృద్ధి చూపించిన ఘనత […]
టీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి పోవాలని టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందన్న ఆయన.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ కుట్ర రాజకీయం చేస్తుందని.. కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దు అని టీఆర్ఎస్-బీజేపీ ప్లాన్ వేస్తున్నాయని మండిపడ్డారు.. ఇక, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు.. సీఎం కేసీఆర్ పరిపాలనలో విఫలం అయ్యారని విమర్శించారు జగ్గారెడ్డి.. అడిగారని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. […]
మా పార్టీ నాయకులపై కేసులు పెట్టిన పోలీసులపై దండయాత్ర చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… హైదరాబాద్ మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు (21వ తేదీన) ఖమ్మం వెళ్తున్నామని వెల్లడించారు.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్టులు పెట్టిన కేసుల సంగతి తేలుస్తామన్న ఆయన.. ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు.. అందరం కలిసి వెళ్తున్నాం.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, నేను.. ఇలా అందరం కలిసే వెళ్తాతం.. […]
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. శ్రీలంక నైరుతి ప్రాంతమైన రాంబుక్కనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంధన ధరలు పెరగడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి […]
తెలంగాణలో వరుస ఆత్మహత్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేతలు.. రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసిన బీజేపీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఖమ్మం సాయి గణేష్ ఆత్మహత్య, కామారెడ్డిలో సంతోష్, పద్మల ఆత్మహత్యలపైన సీబీఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు… రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ హత్యలు, పోలీసుల ప్రవర్తనపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు.. ప్రతిపక్ష […]
అంబేద్కర్ ఆలోచనలను కొంత అయినా పాటించాలి.. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మనం మన గ్రామానికి కొంత అయినా ఇవ్వాలని సూచించారు మంత్రి హరీష్రావు.. సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్ళి గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన గౌడ సంఘం డైనింగ్ హాల్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢ నమ్మకాల నుంచి ప్రజల్ని బయటకు తేవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలను కొంత వరకైనా పాటించాలి.. ఆయన స్ఫూర్తిలో మనం మన […]
తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరుగుతూ పోతోంది.. గవర్నర్ తమిళిసై మీడియాతో ప్రభుత్వంపై విమర్శలు చేయడం, తనకు అవమానం జరిగిందంటూ వ్యాఖ్యలు చేయడం లాంటి ఘటనలు దూరం పెంచుతూ పోతున్నాయి.. ఇదే సమయంలో గవర్నర్కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందేనని.. అధికార టీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అవుతున్నాయి విపక్షాలు. అయితే, గవర్నర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్న […]
భారత్లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. వందల్లోకి వచ్చాయి.. అయితే, ఇప్పుడు మళ్లీ టెన్షన్ పెట్టే విధంగా వేలలోకి వెళ్తున్నాయి.. కరోనా కేసులు పెరుగుతుండటంతో… మరోసారి ఆంక్షల వైపు ఢిల్లీలో అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రోజు వారి కేసులు సంఖ్య రెట్టింపవుతోంది. వైరస్ ఎఫెక్ట్ తీవ్రంగా లేక పోయినప్పటికీ… ఇన్ఫెక్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు అమల్లో లేవు. మాస్కుల వినియోగం తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రతి రోజూ […]