Viral: మత్స్యకారులకి చిక్కిన అరుదైన చేప.. అది అపశకునమట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల వలలకు ఎప్పటికప్పుడు అరుదైన చేపలు చిక్కుతూనే ఉంటాయి.. కొన్ని చేపలు వారు పొట్ట నింపుకోవడానికి ఉపయోగపడితే.. మరికొన్ని చేపలు కాసులు కురిస్తాయి.. ఇంకా కొన్నైతే.. బాగా డబ్బులు సంపాదించిపెడతాయి.. అయితే, ఇప్పుడు మత్స్యకారులకి చిక్కిన చేపను చూసిన తర్వాత.. అందరినీలోనూ భయం నెలకొంది.. ఆ చేప కనిపించడమే అపశకునమని.. ఇది భారీ ప్రమాదాలకు సూచిక అంటూ హడలిపోతున్నారు ప్రజలు.. అయితే, ఈ వ్యవహారం సోషల్ మీడియాకు ఎక్కింది.. అది భయపెట్టే చేప అంటూనే.. షేర్లు, ట్వీట్లు, రీట్వీట్లతో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు..
Read Also: COVID 19: వరుసగా మూడో రోజు 20 వేలకు పైగా కేసులు.. తగ్గని మరణాలు
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ఇక, అసలు విషయానికి వస్తే.. చిలీలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు 16 అడుగుల పొడవున్న అరుదైన చేప చిక్కింది. 16 అడుగులు అంటే 5 మీటర్ల పొడవు వున్న ఈ చేపను ‘ఓర్‌ఫిష్’గా పిలుస్తారట.. అది చూసి మత్స్యకారులు మురిసిపోయేలోపు.. ఇది కీడుకు సంకేతం అంటున్నారు ప్రజలు.. ఈ చేప కనిపించడం అపశకునమంటూ అక్కడి ప్రజలు హడలిపోతున్నారు. ఈ అరుదైన చేప కనిపిస్తే సునామీ, భూకంపాలు వస్తాయని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారట.. అయితే, ఇప్పుడు ఆ చేప మత్స్యకారులకు చిక్కడంతో.. ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని వణికిపోతున్నారు.. సాధారణంగా ఈ చేపలు సముద్ర గర్భం లోతుల్లో జీవిస్తాయట.. భూమి పొరల్లో కదలికలు వచ్చినపుడు మాత్రమే ఇవి బయటకు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నమాట.. అంటే, ఈ చేప సముద్ర జలాల్లో పైకి వచ్చిందంటే సముద్ర గర్భంలో భారీ భూకంపాలు సంభవిచ్చినట్లు సంకేతం అంటున్నారు.. కానీ, దీనిని శాస్త్రీయంగా నిర్ధారించాల్సి ఉంది. మరోవైపు.. ఓర్ ఫిష్ 11 మీటర్ల వరకు పొడవు ఉంటుందని చెబుతున్నారు.. సముద్రపు నీటి అడుగున జీవించే ఈ చేపలు.. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కూడా.. ఇలా పైకి వస్తాయని, బ్రీడింగ్ సమయంతోపాటు చనిపోయాక కూడా జలాలపైకి వస్తాయని నిపుణులు చెబుతున్నమాట.. తాజాగా చిలీలో ఈ చేప చిక్కగా.. ఏప్రిల్ నెలలోనూ న్యూజిలాండ్‌లో ఓ ఓర్ ఫిష్ కనిపించిందట.. మొత్తంగా ఆ 16 అడుగుల ఓర్ ఫిష్.. కొందరిని భయపెడుతుంటే.. చాలా మంది ఆశ్చర్యంగా దానిని గమనిస్తున్నారు.. మొత్తంగా సముద్రంలో ఉండాల్సిన చేప.. నెట్టింట్లో రచ్చ చేస్తోంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!