Sri Lanka Crisis: బైక్‌ను దాటేసిన సైకిల్ ధర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ కొనాలంటే గగనంగా మారిపోయింది.. పెట్రోల్ బంక్‌కు వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియని పరిస్థితి.. అక్కడి వరకు వెళ్తే దొరుకుతుందన గ్యారంటీ లేదు.. ఇక, బ్లాక్ అయితే.. ఏకంగా రూ.2500కు పెట్రోల్ అమ్ముతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొలంబోలో ఉన్న ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మార్కెట్ (FOSE మార్కెట్)లో కిలో టమోటాలు రూ.150కి విక్రయిస్తున్నారు. కిలో ఉల్లిని రూ. 200కు విక్రయిస్తుండగా, కిలో బంగాళదుంపలు రూ.220కి అమ్ముతున్నారు.. కిలో క్యారెట్ రూ.490కి విక్రయిస్తుండగా 250 గ్రాముల వెల్లుల్లిని రూ.160కి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.. ఇదే సమయంలో.. పెట్రోల్ కష్టాల నుంచి బయటపడేందుకు సైకిల్‌ను ఆశ్రయిస్తున్నారు లంక వాసులు.. దీంతో.. సైకిళ్ల ధరలు.. భారత్‌లో లభ్యమయ్యే అనేక బైక్ ధరలను క్రాస్ చేశాయి.. అంతే కాదు.. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి..
Read Also: KTR: ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా విద్యార్థులు
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
శ్రీలంకలో సైకిల్ కొందామన్నా దొరకని పరిస్థితి నెలకొంది.. డీజిల్, పెట్రోల్ కొరత కారణం సైకిల్ కోసం క్యూ కడుతున్నారు లంకవాసులు.. పెద్దవాళ్ల సైకిళ్లను భారీ డిమాండ్ ఏర్పడింది.. ఏకంగా ఓటిన్నర లక్ష దాటేసింది సైకిల్ ధర.. గతంలో 50 వేలకు సైకిల్ దొరికేది.. కానీ, చమురు కొరత, అధిక ధరలతో లంక వాసులు సైకిళ్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో.. వాటి ధరలు రెండింతలు పెరిగాయి.. అయినా.. కొనుగోలు చేద్దామంటే అందుబాటులో లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం లంకలో చిన్నపిల్లలు సైకిలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు వ్యాపారులు. కాగా, భారత్‌లో అనేక మోడల్స్ బైక్‌లో లక్షన్నర లోపే దొరుకుతున్నాయి.. స్పోర్ట్స్ బైక్‌ల ధర వేరుగా ఉన్నా.. లక్షన్నర లోపే చాలా బైక్‌లు అందుబాటులో ఉన్నాయి.. శ్రీలంకలో మాత్రం.. ఆ ధరకు సైకిల్ కూడా దొరకని పరిస్థితి. మరోవైపు.. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా కిరాణా ధరలు పెరగడమే కాదు, ఇంధన కొరత కూడా తీవ్రంగా ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో అత్యవసర అంబులెన్స్ సేవలు కూడా నిలిపివేయబడింది. అత్యవసర అంబులెన్స్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేయవద్దని సువా సేరియా అంబులెన్స్ సర్వీస్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.. 1948లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి ద్వీప దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!