టీఆర్ఎస్ పార్టీ నేతల వ్యవహారాలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి. ఒకటి తర్వాత.. వరుసగా జరుగుతున్న ఘటనల్లో గులాబీ నేతలకు సంబంధాలు ఉండటం ఆ పార్టీకి తలనొప్పిగా పరిణమించింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో జరిగిన మూడు వ్యవహారాలు టీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక… టీఆర్ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. రామాయంపేటకు చెందిన తల్లికొడుకులు ఆత్మహత్య చేసుకోవడం… సెల్ఫీ వీడియో మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ పేరు చెప్పడం… రాష్ట్రవ్యాప్తంగా దుమారం […]
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిత్యావసరాల ధరలు తారాస్థాయికి చేరాయి.. పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. లంక ప్రభుత్వం అధీనంలో గల సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక్క రోజే లీటరు పెట్రోల్‌పై 84 రూపాయల భారం మోపింది. ప్రస్తుతం లంకలో లీటరు పెట్రోల్ ధర 338 రూపాయలుగా ఉంది. సూపర్ డీజిల్ ధర ఒక్క రోజే 75 రూపాయలు పెరిగి… 329 రూపాయలయ్యింది. ఇక ఆటోలకు ఉపయోగించే డీజిల్ ధర 113 రూపాయలు పెరిగి 289 రూపాయలకు […]
భారత్‌లో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.. ఒమిక్రాన్‌లో కొత్త వేరియంట్లు వెలుగు చూసిన తర్వాత.. భారత్‌లో ఫోర్త్ వేవ్ హెచ్చరికలు వినిపిస్తున్నాయి.. మరోవైపు.. అలాంటిది ఏమీలేదని కూడా చెబుతున్నారు వైద్య నిపుణులు.. కానీ, క్రమంగా కరోనా కేసులు పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.. మొన్న రెండు వేలకు పైగా నమోదైన కేసులు.. నిన్న తగ్గాయి.. కానీ, ఇవాళ మళ్లీ ఆ సంఖ్య రెండు వేలను క్రాస్ చేసింది.. Read Also: PM Modi: రేపు ఎర్రకోట నుంచి […]
ఇప్పటి వరకు వస్తున్న సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ ఏప్రిల్ 21వ తేదీన సూర్యాస్తమయం తర్వాత ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. సంప్రదాయం ప్రకారం.. ఎర్రకోట యొక్క ప్రాకారము నుండి ప్రధానులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కానీ, సిక్కుల మతగురువు తేజ్‌బహుదూర్400వ జయంతిని పురస్కరించుకుని.. ఎర్రకోటలో సంప్రదాయానికి భిన్నంగా.. సూర్యాస్తమయం తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు నరేంద్ర మోడీ.. అయితే, స్వాతంత్ర దినోత్సవం వేడుకల సమయంలో ప్రసంగించే ప్రదేశంలో కాకుండా […]
ఓ శునకం ఏకంగా గిన్నీస్ రికార్డు ఎక్కింది.. శునకం ఏంటి? రికార్డుల్లోకి ఎక్కడం ఏంటి? ఇంతకీ ఏం చేసింది? అనే అనుమానాలు వెంటనే రావొచ్చు.. అయితే, ఆది జీవించిన కాలమే.. ఆ శునకాన్ని రికార్డుల్లోకి ఎక్కేలా చేసింది.. అమెరికాకు చెందిన గిసెల్లా షోర్ అనే మహిళ.. టోబీకీత్ అనే కుక్కను పెంచుకుంటున్నారు. ఇది అనాయింట్స్ చినుహుహా జాతికి చెందినది.. దీనిని ‘ప్రపంచంలో అత్యంత పురాతనమైన కుక్క’ బిరుదుతో అభిషేకించింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్… దీని వయస్సు 21 […]
కరోనా వచ్చి పోయినవారిలో దీర్ఘకాలికంగా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సమయంలో లక్షలాది మంది ఆ మహమ్మారి బారినపడ్డారు.. కొంతమందిలో లక్షణాలు లేకుండా వైరస్ సోకడం.. తిరిగి కోలుకోవడం కూడా జరిగిపోయాయి.. వైరస్ సోకిందనే భయంతో ఎంతో మంది ప్రాణాలు కూడా విడిచారు. అయితే, కరోనా సోకిన వారిలో 30 శాతం మంది లాంగ్కోవిడ్తో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనం తేల్చింది.. మొత్తం 1,038 మందిపై పరిశోధన నిర్వహించగా.. వారిలో […]
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలను చుట్టేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్.. ఇవాళ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు.. వచ్చే నెలలో రాహుల్ గాంధీ పర్యటన, కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనుండగా… అంతకు ముందు కేటీఆర్ పర్యటించడం ఆసక్తికరంగా మారింది.. ఇక, కేటీఆర్ పర్యటన ముగిసిన తర్వాత రెండు రోజుల్లో.. టి.పీసీసీ నేతలు వరంగల్‌లో పర్యటించి రాహుల్ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించనున్న విషయం తెలిసిందే. కేటీఆర్ ఇవాళ్టి […]
శ్రీశుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత బుతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, బుధవారం.. రాశి ఫలాలు ఎలా ఉన్నాయి..? ఈ రోజు ఏ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు…? ఏ రాశివారు జాగ్రత్త వహించాలి..? ఏ రాశివారు ఏం చేస్తే మంచి ఫలితాలు రాబోతున్నాయి… బుధవారం రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=BjrlKxJy5HQ
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. చివరకు తామే కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.. ఢిల్లీ వేదికగా కేంద్రానికి డెడ్‌లైన్ పెట్టిన తర్వాత రోజు.. కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. తామే వరి కొనుగోలు చేసేందుకు సిద్ధమై.. దానిపై ప్రకటన చేశారు.. ఇక, మరుసటి రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి.. ఈ నేపథ్యంలో.. ఇవాళ వరి కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు […]