సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మళ్లీ ఆయన్ను సర్వీస్‌లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని తోసిపుచ్చింది సుప్రీం.. అయితే, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించగా.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. సీరియస్‌గా స్పందించారు. ఏపీ ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసిందని.. ఆంద్రప్రదేశ్ […]
తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఖమ్మం బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం హైకోర్టుకు చేరింది… పోలీసుల వేధింపులు తాళలేకే సాయి గణేష్ ఆత్మహత్య చేస్తున్నాడంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఈ ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్.. ఇక, ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు మొత్తం 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.. ఇక, […]
శాప్ ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియతో పాటు మీడియాను షేక్ చేస్తోంది.. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్‌తో బైరెడ్డికి విభేదాలు బహిరంగ రహస్యమే కాగా.. ఈ మధ్య ఓ పరిణామం చర్చకు దారితీసింది.. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు బైరెడ్డి సిద్ధం అవుతున్నారని.. అందులో భాగంగానే ఈ మధ్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ అయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి.. అంతేకాదు.. టీడీపీలో చేరి […]
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే ఉంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరులో పర్యటించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రావణుడి అహంకారం లాగా.. కేంద్రానికి కూడా అహంకారం వుందని విమర్శించారు. అందుకే సాగు చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. రైతులతో చెలగాటాలొద్దని తాము బీజేపీని పదే పదే హెచ్చరించినా.. పెడ చెవిన పెట్టిందని, చివరికి […]
పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ విరుచుకుపడ్డారు. ఆయనో రబ్బర్ స్టాంప్ సీఎం అంటూ ధ్వజమెత్తారు. అసలు పాలన అంతా ఢిల్లీ నుంచే సాగుతోందని, అరవింద్ కేజ్రీవాలే నడిపిస్తున్నారని ఆరోపించారు సిద్ధూ… భగవంత్ మాన్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ సీఎం చెన్నీ, సిద్ధూతో సహా కాంగ్రెస్ నేతలు గవర్నర్ భన్వరీలాల్తో భేటీ అయ్యారు.. వాటిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. […]
మండిపోతున్న పెట్రో ధరలతో క్రమంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు.. అయితే, దేశవ్యాప్తంగా ఈ మధ్యే.. పలు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి.. ఇంట్లో చార్జింగ్ పెట్టిన సమయంలోనే కొన్ని.. రోడ్లపై మరికొన్ని ప్రమాదాలు గురయ్యాయి.. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు.. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.. అయితే, ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. ఆయా వాహనాల కంపెనీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు గడ్కరీ.. లోపాలున్న వాహనాలను తక్షణమే రీకాల్ చేయాలని ఆదేశించారు.. అంతేకాకుండా ఇప్పటిదాకా […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. బిర్లా-సీఎం వైఎస్ జగన్ ఇద్దరూ లంచ్ మీటింగ్ పెట్టుకున్నారని తెలిస్తే చంద్రబాబుకి గుండె అగిపొద్దేమో అని సెటైర్లు వేశారు.. ఆదిత్యా గ్రూప్ కంపెనీ రాష్ట్రానికి రావడం శుభపరిణామంగా అభివర్ణించిన ఆయన.. రూ. 2500 కోట్ల పెట్టుబడులతో 2500 మందికి ఉపాధి రాబోతుందన్నారు.. కానీ, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే చంద్రబాబుకి కడుపు మండుతుందని.. చంద్రబాబు కడుపు మంట ఆయన మాటల్లో కనిపిస్తుందని.. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, […]
మొదట సినిమాల్లో నటించిన రోజా.. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టారు.. ఇక, వైసీపీ చేరిన తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాదు.. మంత్రి పదవి కూడా చేపట్టారు.. అయితే, తనను సినిమాల్లోకి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి తీకొచ్చింది ఎవరు అనే విషయంపై పలు సందర్భాల్లో ఆమె ప్రస్తావించిన విషయం తెలసింది.. ఇవాళ తిరుపతిలోని బ్లిస్ హోటల్ లో మంత్రి రోజాను ఘనంగా సన్మానించింది ఏపీ హోటల్ అసోసియేషన్.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నన్ను సినిమాల్లోకి, […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… మతి భ్రమించిన చంద్రబాబు.. నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారు.. అందుకే చంద్రబాబుకు తెలివి తేటలు, శక్తిసామర్థ్యాలు కావాలంట.. దుర్గమ్మవారిని అవే కోరుకున్నట్లు ఆయనే చెప్పారు.. మరి ఇన్నాళ్లూ అవి లేవా? ఉంటే వాటిని కోల్పోయారా..? అంటూ ఎద్దేవా చేశారు. మంచి మనసు, ఆలోచన ఉంటే అన్నీ బాగుంటాయి.. కానీ, చంద్రబాబుకు అవేవీ లేకుండా పోయాయన్న ఆయన.. చంద్రబాబు ఒక […]