KA Paul: ఢిల్లీలో కేఏ పాల్ మౌనదీక్ష.. ఆగస్టు 15 తర్వాత ఆమరణ దీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హస్తిన వేదికగా ఆందోళనకు దిగారు కేఏ పాల్.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న ఆయన.. ఇవాళ ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో మౌనదీక్ష చేపట్టారు.. మధ్యాహ్నం 12 గంటలకు దీక్షకు దిగిన ఆయన.. మధ్యాహ్నం 3 గంటల వరకు తన దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు.. తెలుగురాష్ట్రాల విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరారు.. 8 ఏళ్లుగా విభజన హామీలను కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.. విభజన హామీలు అమలు కాలేదు, అందుకే తాను రాజ్ ఘాట్ లో మౌన దీక్ష చేస్తున్నానని పేర్కొన్న ఆయన.. జీవితంలో మొట్ట మొదటిసారిగా రాజ్ ఘాట్ లో మూడు గంటల పాటు మౌన దీక్ష చేస్తున్నా.. నాతోపాటు మూడు గంటల పాటు దీక్ష చేయలేని వారు మూడు నిముషాలైనా దీక్ష పాటించాలని సూచించారు.
Read Also: Singapore Open: ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలుగు తేజం పీవీ సింధు
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
ఇక, తాను రాజ్‌ఘాట్‌లో మౌన దీక్ష చేస్తుంటే.. ఈరోజు 2.10 కోట్ల మంది నాతో పాటు ఉపవాసం ఉంటున్నారని తెలిపారు కేఏ పాల్.. విభజన హామీల అమలు కోసం వచ్చే బుధవారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతానని ప్రకటించారు.. విభజన హామీలు అమలు చేయకపోయే ఆగస్టు 15వ తేదీ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.. తెలుగు ప్రజల సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావన్న ఆయన.. అందుకే తాను పోరాటానికి దిగుతున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ మధ్య తెలంగాణలో పరిస్థితులపై ‘ఆరా’ నిర్వహించిన ఎన్నికల సర్వేపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడిన విషయం తెలిసిందే.. ఆరా మస్తాన్ పిచ్చిపిచ్చి సర్వేలు చేస్తే ప్రజలు ఊళ్లలో తిరగనివ్వరని హెచ్చరించిన ఆయన.. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తానన తెలిపారు.. టీఆర్ఎస్ కు 36 శాతం, బీజేపీకి 30 శాతం ఓట్లు వస్తాయని మస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అసలు ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 60 శాతం ఓటు బ్యాంకు ఉందని కేఏ పాల్ పేర్కొన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!