ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది… అయితే, కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు బలి అయ్యారు.. ఆదోని మండలం కుప్పగల్‌లో పిడుగు పడి కనిగిని ఉరుకుంధమ్మ (33), కనిగిని లక్ష్మమ్మ (39) ఇద్దరు మహిళలు మృతిచెందారు.. ఇక, హోళగొంద మండలం వండవాగిలిలో పంట పొలం పనులు చేస్తుండగా పిడుగుపాటుకు తాయన్న, చంద్రన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు విడిచారు.. అధిక ఉష్ణోగ్రతలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీ వాసులకు చల్లని కబురుతో వర్షాలు కురుస్తున్నామ.. […]
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం… మరోసారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాంది… జులై మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.. 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. కాగా, శ్రీవారి దర్శన టికెట్లతో పాటు సేవా టికెట్లను భక్తుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది.. ఆన్లైన్లో పెట్టిన కొన్ని గంటల్లోనే […]
రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధాల వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… రాజ్యాంగం, ఆత్మప్రబోధం మేరకు అధికారులు పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.. రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధం సరికాదని హెచ్చరించిన ఆయన.. పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించే విధంగా సంస్కరణలు ఉండాలన్నారు.. అధికారులకు వారి పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించాలనే విషయంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. విధి నిర్వహణలో ఏమైనా అనుమానాలొస్తే రాజ్యాంగంతో పాటు ఆత్మప్రబోధం […]
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెదిరింపుల వ్యవహారం చర్చగా మారింది.. తమ నేత ఇమ్రాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉందని ఆ పార్టీ నేతలు పేర్కొనడంతో.. పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ఇమ్రాన్ ఖాన్‌కు పూర్తి భద్రతల కల్పించాలని.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు.. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను ప్రధాని షరీఫ్ ఆదేశించినట్లు ప్రధాని కార్యాలయం సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇమ్రాన్ భద్రత విషయంలో తక్షణ, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. […]
కరోనా మహమ్మారికి చెక్‌పెట్టేందుకు క్రమంగా అన్ని ఏజ్ గ్రూప్‌లకు వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది కేంద్ర ప్రభుత్వం.. దశలవారీగా ఇప్పటికే 12 ఏళ్లు పైబడినవారి వరకు వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా.. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించింది ప్రభుత్వం.. అందులో భాగంగా.. ఇవాళ ఎక్స్పర్ట్ కమిటీ సమావేశంమైంది.. 5-12 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై చర్చించింది.. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో 5 నుంచి 12 ఏళ్ల మధ్య పిల్లలకు […]
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సిటీలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా యుద్ధం కొనసాగిస్తోంది రష్యా.. వరుగా సిటీలను స్వాధీనం తీసుకుంటూ ముందుకు సాగుతోంది.. ఇక, ఉక్రెయిన్ కీలక నగరాల్లో ఒకటైన మేరియుపోల్ తమ వశమైయిందని తాజాగా ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆ దేశా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో జరిగిన సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. మేరియుపోల్ విమోచన కోసం చేపట్టిన సైనిక చర్య విజయవంతం కావడం గొప్ప విజయంగా అభివర్ణించారు.. మిమ్మల్నందరినీ […]
వరుస బాంబు పేలుళ్లతో మరోసారి ఆఫ్ఘనిస్థాన్ ఉలిక్కిపడింది… ఏకంగా ఐదు బాంబులు పేలడంలో అంతా ఆందోళనకు గురయ్యారు.. కాబూల్ సహా ఐదు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి.. ఈ పేలుళ్లలో మొత్తం 20 మందికి పైగా మృతిచెందారు.. ఇక, ప్రార్థనా మందిరంలో జరిగిన భారీ పేలుడులో 65 మంది గాయాలపాలయ్యారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆఫ్ఘన్‌లోని మజార్-ఎ-షరీఫ్‌లోని మసీదులో జరిగిన పేలుడులో 5 మంది మృతి చెందగా, 50 మందికి గాయాలు అయ్యాయి.. […]
గృహ నిర్మాణానికి నిధుల కొరత లేదు.. సీఎం వైఎస్ జగన్ అందరికీ సొంతింటి కలను నెరవేరుస్తారని తెలిపారు మంత్రి జోగి రమేష్.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పేదలకు సొంతిల్లు కట్టించాలనే సంకల్పంతో 31 లక్షల మందికి ఇళ్లు ఇస్తున్నట్టు వెల్లడించారు.. అందులో భాగంగా మొదటి విడతలో 15.6 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు… సీఎం వైఎస్ జగన్ ఆలోచనా విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని.. గృహనిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. Read Also: […]
సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవడం ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అంటూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎవరి ఒత్తిడితో ప్రయాణికులను దింపి మరీ వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలి.. అని డిమాండ్ చేసిన ఆయన.. సీఎం జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణికులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకునే […]
వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇవాళ తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయన.. రేపు ఒంగోలు వెళ్లనున్నారు.. ఇక, శుక్రవారం ఒంగోలు వేదికగా.. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం వైఎస్ జగన్.. దీనికోసం రేపు ఉదయం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి.. ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.. అక్కడ జరిగే బహిరంగ […]