జీవితా రాజశేఖర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది చిత్తూరు జిల్లా నగరి కోర్టు.. జ్యోస్టర్ ఎండీ హేమ… జీవితపై ఫిర్యాదు చేశారు… ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారని జీవితారాజశేఖర్‌పై ఆరోపణలు చేశారు.. ఆమె తనకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని హేమ చెబుతున్నారు. రూ.26 కోట్లు ఎగ్గొట్టారని జీవితారాజశేఖర్‌పై హేమ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే కాగా.. ఈ వ్యవహారం కోర్టు వరకు చేరింది.. ఇవాళ నగరి జేఎఫ్‌సీఎం కోర్టు.. జీవితా రాజశేఖర్‌కి నాన్ బెయిలబుల్ […]
శ్రీలంకలో సంక్షోభం మరింత ముదిరింది. ఒకవైపు పెరుగుతున్న. ఆహార ధరలు… మరోవైపు ఆందోళన నడుమ శ్రీలంక వాసులు తల్లిడిల్లిపోతున్నారు. ఎప్పుడూ ఎమీ జరుగుతోంది అర్థం కాని అయోమయాపరిస్దితిల్లో బతుకుతున్నారు.. నెలరోజులుగా రోడ్డెక్కి నినదిస్తున్న శ్రీలంక ప్రజల ఆందోళన హింసాత్మకంగా మారుతున్నాయి. దీనికి కారణం ఆందోళనకారులను బలప్రయోగంతో అణచివేయాలని అక్కడి ప్రభుత్వం భావించడమేనని అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు రోజుల క్రితం లంక రాజధాని కొలంబో సమీపంలోని రాంబక్కన్ పట్టణంలో ప్రజలు నిర్వహిస్తున్న ఆందోళనలో హింస చోటుచేసుకుంది. […]
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఎంపీ విజయసాయి రెడ్డిని.. అనుబంధ సంఘాల ఇంచార్జ్‌కే పరిమితం చేశారు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ప్రాంతీయ పార్టీలలో అధినేత ఆదేశాలను పాటించడమే శిరోధార్యం… నాకు ఇది కావాలి, ఇది వద్దు అనే ప్రస్తావన ఎక్కడ రాకూడదన్నారు.. ఛార్టర్డ్ అకౌంటెంట్ అయిన నాకు జగన్ మోహన్ రెడ్డి అనేక అవకాశాలు ఇచ్చారన్న ఆయన.. సాక్షిలో ఫైనాన్స్ డైరెక్టర్ నుంచి […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రతిపాదన చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కలిసి ముందు సాగితే బాగుంటుందనే ప్రతిపాదన తీసుకొచ్చారు.. అయితే, వైసీపీ, కాంగ్రెస్ దోస్తీ విషయంలో ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై ఘాటుగా స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు పుట్టిందే వైసీపీ అన్న ఆయన.. వ్యూహకర్తలు సలహాలు ఇస్తారు.. కానీ, అమలు చేయాలో లేదో నిర్ణయం […]
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం ఘటన కలకలం సృష్టిస్తోంది.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు.. అయితే, విజయవాడ జీజీహెచ్ లో సామూహిక అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్న ఆయన.. అలాగే దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో కూడా ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.. […]
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.. తెలంగాణలో పాదయాత్రలు, దీక్షలు, ధర్నాలతో దూసుకెళ్తున్నారు వైఎస్ షర్మిల.. ఏ అవకాశం దొరికినా ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ.. తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతోంది.. అందరికీ న్యాయం జరుగుతుందంటూ ముందుకు సాగుతున్నారు. అయితే, రాబోయే […]
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్.. ఈ నెల 27వ తేదీన కమిషన్ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది… విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార ఘటన కలకలం సృష్టించగా.. ఇవాళ అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు నేతలు క్యూ కట్టారు.. ఏపీ మంత్రులతో పాటు.. టీడీపీ నేతలు కూడా ఆస్పత్రికి వెళ్లారు.. ఈ క్రమంలో.. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి […]
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డుదారులకు రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. బియ్యం తీసుకోవాలా, డబ్బులు తీసుకోవాలా అనేది లబ్ధిదారుల ఇష్టమని తెలిపింది.. అయితే, ఇప్పుడు నగదు బదిలీని వాయిదా వేసినట్టు తెలిపారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పౌర సరఫరాల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి.. 26 జిల్లాల జేసీలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో.. రేషన్ కార్డుదారులకు నగదు బదిలీని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు వెల్లడించారు.. యాప్‌లో సాంకేతిక లోపం […]
తిరుపతి జిల్లా తొలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు.. ఆయన సైనికుడిగా పనిచేస్తానని వెల్లడించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆయనను నియమించిన విషయం తెలిసిందే కాదు.. ఆత్మీయ సమావేశం నిర్వహించాం.. జగనన్న అవకాశం ఇచ్చారు.. అందరినీ కలుపుకుని, పార్టీని మరింత బలపేతం చేస్తానని వెల్లడించారు.. ప్రతి పల్లెలోకి వెళ్తాం… ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రతి ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.. ప్రతి మండలంలో వైఎ్సార్సీపీ సర్వసభ్య […]
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. రూ.139 కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. డోరాండా ట్రెజరీ నుంచి రూ. 139 కోట్లకు పైగా అపహరణకు సంబంధించిన దాణా కుంభకోణం కేసులో.. 73 ఏళ్ల లాలూ ప్రసాదవ్ యాదవ్‌ను ఫిబ్రవరిలో దోషిగా తేల్చింది సీబీఐ కోర్టు.. శిక్ష కూడా విధించింది.. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని […]