CM YS Jagan Review on Godavari Floods: వరదలపై సీఎం జగన్ రివ్యూ.. 48 గంటల్లో పూర్తి చేయాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి వరదలతో ఏపీ అతలాకుతలం అయ్యింది.. ఉగ్రరూపంతో పంజా విసిరిన గోదావరి.. ప్రస్తుతం ధవళేశ్వరం దగ్గర నిలకడగా కొనసాగుతోంది.. ఇక, గోదావరి వరదలపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. 6 జిల్లాల కలెక్టర్లు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోంది.. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాల్సి ఉంది.. సీనియర్ అధికారులు, కలెక్టర్లు భుజాలమీద ఈ బాధ్యత ఉందని.. వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లు మిగిలి పోకుండా రూ.2వేల రూపాయల సహాయం అందివ్వాలని ఆదేశాలు జారీ చేశారు.. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్… ఈ రేషన్ అంతా సిద్ధంగా ఉందని.. వదర బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలని ఆదేశించారు.
గతంలో రెండు జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు మాత్రమే ఉండేవారు, ఇద్దరు జాయింట్‌కలెక్టర్లు మాత్రమే, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారు, కాకినాడతో కలుపుకుని ఇప్పుడు ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు ఉన్నారు.. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అందుబాటులో ఉంది.. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉన్నారు.. ప్రతి 50 ఇళ్లకూ ఒక వాలంటీర్ ఉన్నారు.. ఇలాంటి వ్యవస్థకు ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది.. నాణ్యమైన సేవలు అందించాలని స్పష్టం చేశారు సీఎం జగన్.. గతంలో ఎప్పుడూ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం చేయలేదు.. విరామం ఎరుగకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం. అలాంటి వారిలో నైతిక స్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వాంటివారు బురదజల్లుతున్నారు.. వీరంతా రాష్ట్రం ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు.. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి ఇలాంటి ప్రచారాలు చేస్తారని మండిపడ్డారు.. బురదజల్లడానికి నానారకాలుగా ప్రయత్నిస్తున్నారు. మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు.. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి.. దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలి, వదంతులను కూడా తిప్పికొట్టాలని సూచించారు సీఎం జగన్.
Also Read
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
- Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
ఇంకా మీకు ఏమైనా కావాలన్నా.. మీకు అన్నిరకాలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు సీఎం జగన్.. నిధుల సమస్య లేనే లేదు, మీరు ప్రోయాక్టివ్‌గా మందుకు వెళ్లండి, ఎలాంటి సమస్య ఉన్నా.. పరిష్కరించడానికి ఫోన్‌కాల్ చేస్తే చాలు.. వచ్చే 48 గంటల్లో వరద బాధిత కటుంబాలకు రేషన్, రూ.2వేల రూపాయలు అందాలని, బాధిత కుటుంబాలకు మానవతా దృక్పథంతో వ్యవహరించండి, ఇప్పటివరకూ ఒక్కరు మాత్రమే మరణించినట్టుగా సమాచారం ఉంది.. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించండి.. ఎక్కడ అవసరం ఉంటే.. అక్కడ శిబిరాలు కొనసాగించండి.. మంచి ఆహారం.. తాగునీరు అందించండి, పారిశుద్ధ్యం ఉండేలా చూసుకోండి.. బాధితులు శిబిరాలకు వచ్చినా, లేకున్నా.. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికీ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం, రేషన్ అందాల్సిందేనని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.. వరద తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వేయాలి.. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తిచేయాలన్నారు. గర్భవతులైన మహిళలపట్ల ప్రత్యేక శ్రద్ధవహించండి, వారిని ఆస్పత్రులకు తరలించండి, వైద్యాధికారులు, స్పెషలిస్టులు అందుబాటులో ఉంచేలా చూసుకోండి.. వరదల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి.. అలాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకోండి.. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది, మందులు ఉండేలా చూసుకోండి.. రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించండి.. క్లోరినేషన్ కొనసాగించాలి, అన్ని మంచినీటి పథకాలను ఒక్కసారి పరిశీలించండి.. మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయించాలని ఆదేశించారు.
పక్కజిల్లాలనుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య సిబ్బంందిని తరలించాలని ఆదేశించారు సీఎం.. పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్న ఆయన.. ఇతర జిల్లాలకు తరలించేటప్పుడు ఆ సిబ్బందికి వసతి, భోజన సదుపాయాలు లోటు రాకుండా చూసుకోవాలన్నారు.. పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖల విభాగాధిపతులు దీనిపై దృష్టిసారించాలని.. మురుగినీటి కాల్వల్లో పూడిక తీయాలని.. నీరు తగ్గగానే కల్వర్టులు, బ్రిడ్జిలపై పరిశీలనచేసి అవసరమైన మరమ్మతులు, నిర్మాణాలు చేయాలని పేర్కొన్నారు.. గోదావరి కట్టలు బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం.. పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలి.. అన్ని డ్రెయిన్ల ముఖద్వారాలు మూసుకుపోయే అవకాశం ఉన్నందున.. అక్కడ పూడిక తొలగించే పనులు చేయాలి.. గట్లు, కాల్వలకు ఎక్కడ గండ్లుపడ్డా వాటిని వెంటనే పూడ్చివేయాలని తెలిపారు.. పశువులకు పశుగ్రాసం, దాణా అందేలా చూడాలి.. పశు సంపదకు నష్టం వాటిల్లితే వాటి నష్టంపై అంచనావేయాలని.. వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.. వచ్చే 48 గంటల్లో ఈసమస్యను పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
తాజావార్తలు
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?