ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. ఓట్లు, సీట్ల గురించి సవాళ్లు, ప్రతి సవాళ్లు వినిపిస్తున్నాయి.. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే.. ఈ సారి ఎక్కువగా వస్తాయని.. రాష్ట్రంలోని 175 స్థానాలకు 175 తామే గెలుస్తామని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నమాట.. అయితే.. రానున్న ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 కాదు కదా.. 17 సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొండ్రు మురళి.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు న ఆయుడు యూనివర్శల్ నాయకుడు… కానీ, వైఎస్ జగన్ గల్లీనాయకుడు అంటూ వ్యాఖ్యానించారు.. మద్యం అమ్మకాల్లోనూ అవినీతి జరుగుతుందని ఆరోపించిన ఆయన.. సొంత బ్రాండ్‌లతో రోజుకి రూ.250 కోట్లు నువ్వే దోచుకు౦టున్నావు అంటూ.. సీఎం వైఎస్ జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
Read Also: Business Headlines 19-07-22: పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన రిటైల్ సేల్స్..
వైన్, మైను, ల్యాండ్ అన్నీ దోచుకు౦టున్నారు అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు కొండ్రు మురళి.. మీలాంటి గల్లీనాయకుడు వెనక మేము రాము అని స్పష్టం చేసిన ఆయన.. నీ వెనకాల ఉన్న నాయకులు గడ్డితినడానికి ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.. మరోవైపు.. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతపై దాడి వ్యవహారం కలకలం సృష్టించింది.. దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. రొంపిచర్ల మండల అధ్యక్షుడు బాల కోటిరెడ్డిపై వైసీపీ ఎంపీపీ, అతని అనుచరులు ఒక పథకం ప్రకారమే దాడి చేశారని ఆరోపించిన ఆయన.. సీఎం జగన్ రాష్ట్రం మొత్తం పులివెందుల లాగా అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పోలీసులు వైసీపీ నేతలకు సొంత చుట్టాలుగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. ఎన్ని అరాచకాలు చేసైనా సరే మళ్లీ గెలవాలని చూస్తున్నారు అని.. వైసీపీ ప్రభుత్వం ప్రజలలో ఆదరణ కోల్పోయి ప్రతిపక్షాలపై హత్య రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.