Rupee hits 80 mark: రూ’పాయే’.. డాలర్‌తో రికార్డు కనిష్టానికి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూపాయి పతనం అవుతుంది.. పడిపోతోంది.. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ రోజు రోజుకు వెలవెలపోతూ.. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయి పతనాన్ని చవి చూస్తోంది.. భారత స్టాక్ మార్కెట్ల నష్టాలు, ఎఫ్‌ఐఐలు తరలిపోవడం, విదేశీ చెల్లింపులు తదితర పరిణామాలు రూపాయిని అగాథంలోకి నెడుతున్నాయి.. ఈ క్రమంలోనే ఇవాళ డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా రూ.80కి దిగజారింది. రూపాయి చరిత్రలోనే ఇది అతి కనిష్ట స్థాయి కావడం ఆందోళన కలిగించే విషయం.. కట్టడి చర్యల కోసం ఈ వారం ఆర్బీఐ సమావేశం కాబోతోంది.. ఇప్పుడు రూపాయిని వెంటాడుతోన్న భయాలు ఏంటంటే.. రూపాయి 80 డాలర్ స్థాయిని తాకిన తర్వాత మరింత పతనం తప్పదనే హెచ్చరికలు.
Read Also: Today Gold Price : స్థిరంగా పసిడి.. కాస్త పెరిగిన వెండి..
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
బ్లూమ్‌బెర్గ్ 79.9863 వద్ద ప్రారంభమైన తర్వాత గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే రూపాయి చివరిగా 80.0163 వద్ద ట్రేడ్ అవుతుంది.. ఇంట్రా-డే రికార్డు కనిష్ట స్థాయి 80.0175ని తాకింది. ప్రారంభ ట్రేడింగ్‌లో యుఎస్ డాలర్‌తో రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 80.05 వద్ద ఉండగా.. క్రితం ముగింపుతో పోలిస్తే 7 పైసలు నష్టపోయింది.. దేశీయ షేర్లలో బలహీనత కారణంగా మంగళవారం భారత రూపాయి వరుసగా ఏడవ సెషన్‌లో రికార్డు స్థాయికి చేరిందని.. సెంట్రల్ బ్యాంక్ డాలర్ అమ్మకం జోక్యం మరింత నష్టాలకు పరిమితం చేసింది విశ్లేషకులు చెబుతున్నారు.. గత ఏడు సెషన్లలో ఆరింటిలో రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈ ఏడాది భారత కరెన్సీ 7 శాతానికి పైగా పడిపోయింది. ఇక, ఈ ఏడాది దేశం నుండి విదేశీ నిధుల ప్రవాహం ఎక్కువగా ఉంది.. గత రెండు సంవత్సరాలలో కలిపి వచ్చిన ఇన్‌ఫ్లోల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం భారతీయ ఆస్తుల నుండి విదేశీ పెట్టుబడిదారులు రికార్డు స్థాయిలో $29 బిలియన్లను వెనక్కి తీసుకున్నారు. ఇది కూడా రూపాయి పతనానికి దారి తీసినట్టు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!