ఆంధ్రప్రదేశ్‌లో మరో టీడీపీ నేతపై దుండగులు దాడి చేశారు.. ఇప్పటికే ఏపీలో పలువురు టీడీపీ నేతలు హత్యకు గురయ్యారు.. కొందరు తృటిలో తప్పించుకున్నారు.. వారి హత్యకు కారణాలు ఏమైనా.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.. అయితే, తాజాగా మరో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది.. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి పై దాడికి పాల్పడ్డారు దుండగులు.. అలవల గ్రామంలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో గొడ్డళ్లతో బాలకోటిరెడ్డిపై దాడికి చేశారు ప్రత్యర్థులు.. తీవ్రగాయాలపాలైన బాలకోటి రెడ్డిని వెంటనే నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.. వివిధ టెస్ట్‌లు నిర్వహించిన డాక్టర్లు.. ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు.. కాగా, గతంలో రొంపిచర్ల ఎంపీపీగా కూడా పనిచేశారు వెన్న బాల కోటిరెడ్డి. ఆయనపై దాడి చేసింది ఎవరు? దాడికి వెనుక ఉన్న కారణాలేంటి..? రాజకీయ కక్ష్యలా? లేక వ్యక్తిగత గొడవలా..? లాంటి అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: Sri Lankan presidential election: అధ్యక్షుడి ఎన్నికకు నేడు నామినేషన్లు.. రేసులో ఉంది వీరే..!
మరోవైపు.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై దాడి ఘటనను ఖండించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఇది వైసీపీ రౌడీల పనేనని ఆరోపించిన ఆయ.. సీఎం జగన్ ఫ్యాక్షన్ భావాల్ని నరనరనా నింపుకున్న వైసీపీ కార్యకర్తలు మృగాల కంటే హీనంగా ప్రవరిస్తున్నారని.. ప్రతి రోజూ సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.. అధికార మదంతో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైసీపీ రౌడీ మూకల్ని హెచ్చిరిస్తున్నాం.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ గుండాలకు ప్రత్యేకంగా కంటికి కన్ను, పంటికి పన్ను అనే పథకం అమలు చేస్తే మీ పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు.. చర్యకు ప్రతి చర్య ఉన్నట్టు ఇప్పుడు మీరు చేసే ప్రతి అరాచకానికి కర్మఫలం ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు అచ్చెన్నాయుడు.