ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఐఏ సోదాలు కలకలం సృష్టించాయి.. ఏకకాలంలో ప్రకాశం జిల్లా, విజయవాడ, నెల్లూరులో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, విజయవాడలోని రెండు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష, విరసం నేత కల్యాణ్ రావు ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు.. శిరీష ఇంట్లో లేకపోవడంతో తాళం పగలగొట్టి మరీ సోదాలు చేపట్టడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.. విజయవాడలోనూ ఎన్ఐఏ సోదాలు చేసింది.. సింగ్ నగర్‌లో విరసం నేత దొడ్డి ప్రభాకర్ నివాసంలో తనిఖీలు చేశారు ఎన్‌ఐఏ అధికారులు.. మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో ఈ సోదాలు చెపట్టినట్టు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది.. ఆలకూరపాడు, విజయవాడ, నెల్లూరులలో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.. మావోయిస్ట్ నేత ఆర్కే భార్య పద్మ అలియాస్ శిరీష ఇంట్లో ఎన్ఐఏ అదికారుల సోదాలు చేస్తున్నారు.. ఆర్కే భార్య శిరీష ఇంట్లో లేకపోవటంతో తహశీల్దార్ సమక్షంలో ఇంటి తాళాలు పగులగొట్టి సోదాలు నిర్వహిస్తున్నారు.. ఉదయం మూడు గంటల నుండి తనిఖీలు కొనసాగుతున్నాయి.. విరసం నేతలపై కొద్దిరోజుల క్రితం విశాఖ జిల్లా పెద్దబాయలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. దీంతో, ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఎన్ఐఏ అధికారుల బృందం విజయవాడకు చేరుకుని సింగ్‌నగర్‌లో విరసం నేత దొడ్డి ప్రభాకర్ ఇంట్లో కూడా సోదాలు చేసింది..
అయితే, సోదాలు నిర్వహించే సమయంలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ విజయవాడలో ఉన్నారు ఆర్కే భార్య శిరీష.. తాను ఇంట్లో లేని సమయంలో ఎన్ఐఏ అదికారుల సోదాలు నిర్వహించటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఎన్ఐఏ, పోలీస్ అధికారులు తమను తరచూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, విజయవాడ అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్‌లో ఓ గృహం లో ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.. గత ఏడాదిగా అక్కడ ఓ కుటుంబం అద్దెకు ఉంటుంది.. తెల్లవారుజామున ఒక్కసారిగా గృహంపై స్ధానిక ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ సాయంతో తనీఖీలు చేపట్టారు ఎన్ఐఏ అధికారులు.. ఈ ప్రాతం నుండి మావోయిస్టులకు నగదు బదీలలు జరిగినట్లు సమాచారం ఉందంటున్నారు.. స్థానిక పోలీసులను మావోయిస్టు సానుభూతి పరులుగా ఎన్‌ఐఏ అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది.. వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు…