CPI Narayana apology: చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. నారాయణ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు.. నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు.. కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి… కాస్త అన్నం పెట్టండి …! తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.. దీంతో, వివాదం మరింత పెరిగే అవకాశం ఉందని భావించిన నారాయణ.. మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా.. నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు.
Read Also: Naga Babu Konidela: సీపీఐ నారాయణపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు.. గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడు..!
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
అయితే, తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలు బాషా దోషంగా భావించాలని విజ్ఞప్తి చేశారు నారాయణ.. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా.. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు ఇంతటితో మరిచిపోండి అని కోరారు.. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు చేస్తుటాం.. చిరంజీవి గతంలో రాజకీయాల్లో ఉన్నారు.. రాజకీయాల్లో విమర్శలను స్పోర్టివ్‌గా తీసుకోవాలి.. కానీ, ఆయనపై తాను అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదన్నారు నారాయణ.. ఇక, వరద బాధితులను ఆదుకోవడం కోసం అందరూ కలిసి పని చేద్దాం.. వరద సహాయక చర్యల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలం అయ్యారని దుయ్యబట్టిన నారాయణ.. వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికే పోలవరం వరద వివాదానికి కారణంగా పేర్కొన్నారు.
కాగా, తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహా విష్కరణకు చిరంజీవి హాజరుకావడాన్ని తప్పుపట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటి వాడని పేర్కొన్న నారాయణ.. చిల్లర బేరగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రేక్షకులకు అల్లూరిని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణను పిలవకుండా చిల్లర బేరగాడు చిరంజీవిని స్టేజి మీదకు తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారని మండిపడ్డ నారాయణ.. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ లాంటివాడని అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు నారాయణ.. అయితే, మెగా బ్రదర్స్‌పై నారాయణ చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్‌తో పాటు జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం.. నాగబాబు కూడా రంగంలోకి దిగడంతో.. ఇక చేసేది ఏమీ లేక.. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు నారాయణ.
తాజావార్తలు
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!