-
Borugadda Anil Kumar: నేను జగన్ వీరాభిమానిని.. ఆయన కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధం..
Borugadda Anil Kumar: నెల్లూరు రాజకీయాలు ఇప్పుడు నెల్లూరులోనే కాదు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చగా మారాయి.. అయితే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేస్తున్న విమర్శలు, కామెంట్లకు అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్ ఎటాక్ జరుగుతోంది.. కోటంరెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బోరుగడ్డ అనిల్ కుమార్.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోటంరెడ్డి లాంటి వాళ్లు జగన్మోహన్ రెడ్డి కాలి గోటి మట్టితో సమానం అని వ్యాఖ్యానించారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి […] -
Vani Jayaram: వాణీ జయరాం మృతిపై అనుమానాలు.. రంగంలోకి ఫోరెన్సిక్.. అసలు ఏం జరిగింది..?
Vani Jayaram: ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం కన్నుమూశారు.. అయితే, తన నివాసం విగత జీవిగా ఆమె పడి ఉన్న తీరు, ఆమె ముఖంపై గాయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. దీంతో, వాణీ జయరాం తూలిపడి మృతిచెందారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.. వాణీ జయరాం మృతిపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినా త్రిబుల్ కేన్ పోలీసులు.. ఆమె తలకు తీవ్రగాయం ఉండటంతో పని మనిషి ఇచ్చిన […] -
Stampede: ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురు మహిళలు మృతి
Stampede:చీరలు ఉచితంగా ఇస్తున్నారంటూ మహిళలు ఎగబడ్డారు.. చీరలు తీసుకోవడానికి పోటీపడ్డారు.. దీంతో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.. తమిళనాడులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.. తిరువత్తూరులో జిల్లా వాణియంబాడిలో మురుగన్ తైపుసం వేడుకల్లో ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.. అయితే, ఒక్కసారిగా మహిళలు తోసుకురావడంతో.. తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మహిళలు ప్రాణాలు విడవగా.. మరో మరో 22 మంది మహిళలు తీవ్రగాయాలపాలయ్యారు.. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి […] -
Jr.NTR Political Entry: లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు.. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా లాభంలేదు..!
Jr.NTR Political Entry: తెలుగుదేశం పార్టీ, జూనియర్ ఎన్టీఆర్ పొలిటిక్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.. ఇప్పుడు తెలుగు దేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదన్నారు.. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందన్న లక్ష్మీపార్వతి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లాగా.. జనంలో ఉంటే ఐదేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కు అవకాశం ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరన్న లక్ష్మీపార్వతి.. ఇకవేళ జూనియర్ […] -
Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
టాలీవుడ్ యంగ్ హీరో అరెస్ట్.. సినీ నటుడు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేసిన నవీన్ రెడ్డి.. కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.. ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అభియోగాలు మోపారు.. సమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్ రెడ్డిపై భాదితులు, ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు ఫిర్యాదు చేయడంతో.. ఈ మోసం […] -
Off The Record: బీఆర్ఎస్లో మామిడితోట విందు రాజకీయాలు.. ఎమ్మెల్యేపై తిరుగుబాటు..!
Off The Record: ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే రాములు నాయక్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్కే చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు గళం విప్పారు. ఎమ్మెల్యే వల్ల తమకు ప్రయోజనం లేదని నినదిస్తున్నారు. వైరా మున్సిపాలిటీగా మారి మూడేళ్లే అయ్యింది. నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాగుతుందని వారు ప్రశ్నిస్తున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయని టాక్. తాము తెలంగాణలో లేమా అని ప్రశ్నిస్తూ ఓ మామిడి తోటలో విందు రాజకీయాలకు […] -
Off The Record: కోటంరెడ్డి ఎపిసోడ్లో తెలుగు తమ్ముళ్లు ఎందుకు సైలెంట్..?
Off The Record: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తానని అనుచరులకు చెప్పేశారు. ఆయన అలా అన్నారో లేదో అధికారపార్టీ వైసీపీ ఆయన అధికారాలను కత్తెరించి.. రూరల్ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరును ప్రకటించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో స్పందించంది నెల్లూరు జిల్లా టీడీపీ నేతలే. అలాగే కోటంరెడ్డిని ఆహ్వానిస్తూ టీడీపీ పెద్దల నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఎమ్మెల్యే శిబిరంలోనూ ఆందోళన కనిపిస్తోందట. నెల్లూరు జిల్లా టీడీపీలో […] -
Off The Record: తెలంగాణలో బీజేపీ ప్రయోగాలు..! నేతల్లో అప్లోడ్ అలజడి..!
Off The Record: గాలిలో కాకుండా గ్రౌండ్లో ఉండి పనిచేయాలని తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఢిల్లీ పార్టీ పెద్దలు. కేవలం చెప్పి వదిలేయడమే కాకుండా ఏం చేయాలో.. ఏమేమి చేయాలో పూసగుచ్చినట్టు వెల్లడిస్తున్నారట. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి కొన్ని షరతులు పెట్టడంతో వాటిపైనే పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గ్రౌండ్ లెవల్ రియాలిటీని వెంటనే తెలుసుకోవడం కోసం.. ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి ఒక యాప్‌ను సిద్ధం చేసింది బీజేపీ. పార్టీ నేతలంతా […] -
Off The Record: భూమా అఖిల వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్.. శిల్పా రవిని చిక్కుల్లో పడేశారా?
Off The Record: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఫ్యామిలీ టీడీపీతో టచ్‌లో ఉందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే నెల్లూరు వైసీపీ రాజకీయాలపై రాష్ట్రంలో వాడీవేడీ చర్చ జరుగుతున్న తరుణంలో ఆమె చేసిన కామెంట్స్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో నంద్యాల రాజకీయాలు కూడా హీటెక్కాయి. మాజీ మంత్రి వ్యాఖ్యలు టీడీపీ, వైసీపీ శిబిరాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశాయనే చెప్పాలి. నిజంగానే శిల్పా కుటుంబం టీడీపీతో టచ్‌లో ఉందా? లేక […] -
Threatening calls: కోటంరెడ్డికి బెదిరింపు కాల్స్.. ఎడ్ల బండికి కట్టి వీధుల్లో ఈడ్చుకుపోతా..!
Threatening calls: నెల్లూరు రాజకీయాల్లో కాకరేపిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఇప్పుడు బెదిరింపుల పర్వం మొదలైందట.. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని.. ఆరోపణలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కడప జిల్లా నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన అనిల్ అనే వ్యక్తి కోటంరెడ్డికి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల […]
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!